ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, డిసెంబర్ 2020, మంగళవారం

బానిసత్వ నిర్మూలన సాధ్య‌మేనా?

బానిసత్వ నిర్మూలన సాధ్య‌మేనా?(వ్యూస్ 29.12.2020) https://vyus.in/?p=9086 డిసెంబ‌ర్ 2న మొక్కుబ‌డిగా నిర్వ‌హ‌ణ‌ అన్ని దినోత్స‌వాల‌దీ అదే తంతు ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసలను వెట్టి చాకిరీ నుండి బయట పడేసే ఉద్దేశం తో 1949లో ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించింది. బానిసత్వ నిర్మూలన జరగలేదు కానీ ఏటా డిసెంబర్‌ రెండో తేదీన ఇది దినోత్సవం లాగా జరుగుతుంది. ఎవరికీ ఏమీ అందకుండానే ప్రాణాంతక పురుగుమందులతోనే ‘ప్రపంచ నేల దినోత్సవం’,అంతర్జాతీయ మానవ హక్కుల దినం’ జరిపేశారు. బానిసత్వం ఎన్నో రకాలుగా ఉంటుంది. శారీరక మానసిక ఆర్థిక బానిసత్వాలు నిరంతరం చూస్తూనే ఉన్నాం.కులాలు మతాలు బలహీనుల్ని ఏలాయి. బానిసలు నేటికీ కొనసాగుతూనే ఉన్నారు. రైతుల్ని ఉగ్ర‌వాదులంటున్నారు ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతులు వ్యవసాయ బిల్లుల రద్దుకోసం పోరాడారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులన్నారు, రైతులకు ఉత్పత్తి వ్యయానికి రెండు రెట్లు అధిక ఆదాయాన్ని అందిస్తామని వాగ్దానం చేసిన కేంద్రం ఈ చట్టాల పట్ల రైతుల అభ్యంతరాలేమిటో తెలుసుకోవాలి. భారత ఆహార మార్కెట్‌ ను కార్పొరేట్ల పరం చేస్తారేమోననే రైతుల భయాన్ని పోగొట్టాలి. ఆర్థిక అసమానతలు పెరిగి ఉపాధి పడిపోయింది. ఉద్దీపనల వల్ల సామాన్యులకు లాభం చేకూరాలి. ఉపాధి కల్పనే మాంద్యానికి మందు. విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు చివరికి వ్యవసాయాన్నికూడా కార్పొరేట్లకు అప్పగిస్తే కార్పొరేట్ల ఆస్తితో పాటు పేదలూ పెరుగుతారు. ఆఫ్రికాలోని నీగ్రోలను అమెరికాకు తరలించి బానిసలుగా మార్చి అమ్మారు. బానిసత్వం నేటికీ వెట్టిచాకిరీగా కొనసాగుతోంది. క‌రోనా బ‌తుకులు కుదేలు కరోనాతో ఉపాధి పోయి కొన్ని కోట్లమంది వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. ప్రపంచంలో కరోనాతో 17.27 లక్షలమంది ఇండియాలో1.46 లక్షలమంది చనిపోయారు. మంచి నీళ్ళు త్రాగి ఏలూరులో వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. బిహార్‌లో మోనోక్రొటోఫాస్‌ అవశేషాలున్నమధ్యాహ్నభోజనాన్ని తిని పిల్లలు చనిపోయారు. దేశంలో సగం మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేమని మూడేళ్లు పడుతుందని భారత్ బయోటెక్ వాళ్ళు అంటున్నారు. జనం చేతిలో కాసులు గలగలలాడేలా ఉపాధి కల్పించాలి. కొనుగోలు సామర్థ్యం పెరిగితే గిరాకీ ఊపందుకొని మాంద్యం తగ్గుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. రైతులను నష్టపరిచే ఎటువంటి చట్టాలనూ తమ రాష్ట్రంలో అమలుచేసేది లేదని కెసిఆర్‌ ప్రకటించారు. లాభాల కోసం మాత్రమే పనిచేసే కార్పొరేట్ వ్యాపారులు దళారులుగా చేరకపోతే దేశంలో ఎక్కడ మంచి ధర దొరికితే అక్కడికెళ్లి రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చుననే చట్టం మంచిదే. కార్పొరేట్ల సంప‌ద‌తో పాటు పెరుగుతున్న పేద‌రికం కార్పొరేట్ల సంపదతో పాటే దేశంలో పేదరికమూ పెరుగుతోంది. అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలే. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంత పురోగమించినా అన్నం పెట్టే రైతులు లేకుండా పూట గడవదు. వ్యవసాయం లేకుండా మానవాళికి బతుకు లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటంలేదు. రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క అమెజాన్లు, వాల్‌మార్టులు చిన్నచిల్లర దుకాణాలను ఛిద్రం చేసి మరీ ఎదుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలను దెబ్బ తీస్తుంది. ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకులను ఏర్పాటు చేసిన పెద్ద సంస్థలకు తక్కువ వడ్డీలకు రుణాలిస్తాయి. ప్రైవేటు బ్యాంకులు తిరిగిరాని రుణాలతో దివాళా తీస్తాయి. ప్రజల డిపాజిట్లకు గ్యారంటీ ఉండదు. ముప్పైలక్షలకోట్ల కరోనా ఆత్మనిర్భర ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చినా ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు. ప‌నికొచ్చే చ‌దువులు ఎక్క‌డా? పనికొచ్చే చదువులు లేవు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కళాసీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే రెండు కోట్లమంది నిరుద్యోగులు పోటీపడ్డారు. రైల్వే గేట్‌మెన్‌, అసిస్టెంట్, గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు 82 లక్షల మంది పట్టభద్రులు బారులు తీరారు. పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు, పనే దొరకట్లేదని పట్టభద్రులూ బాధపడుతున్నారు. ఉపాధికల్పించలేని చదువుల కోసం విద్యారుణాలు మాత్రం ఇస్తున్నారు. మానవాభివృద్ధి సూచీల్లో చైనా 85 వ స్థానంలో ఉంటే ఇండియా 131 వ స్థానంలో ఉంది. ప్రపంచ భూమిలో ఇండియాకు 2.4శాతం ఉంటే జనాభా 16శాతం ఉంది. సంతానోత్పత్తి పెరుగుతూ జనసంఖ్య చైనాను దాటేలా ఉంది. మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుఉంటే బంగ్లాదేశ్‌(72.6), నేపాల్‌(70.8), భూటాన్‌(71.8) . పదివేల జనాభాకు మన దేశంలో వైద్యులు 9 మంది మాత్రమే. వైద్య కళాశాలల్లో సీట్లు చాలక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు వలసపోతున్నారు. వైద్య విద్య ఖర్చు భరించలేని ప్రజలతో వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి. గిరిజన జనాభా ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 3 శాతమే. జనాభాకు తగినట్లు మొత్తం 1500 విశ్వవిద్యాలయాలు కావాల్సి ఉండగా 993 మాత్రమే ఉన్నాయి. దాదాపు కోటి మంది ఏటా వృత్తి ఉపాధి నైపుణ్యం లేని డిగ్రీలు, రెండు లక్షల మంది ఎంఫిల్‌ , పిహెచ్‌డిలు పొందుతున్నారు. విద్య మీద పెట్టుబడిలో ప్రపంచంలో అమెరికా 27, చైనా 44 , సూడాన్‌ 157, ఇండియా 158, నమీబియా 159వ స్ధానాల్లో ఉన్నాయి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో శ్రీలంక 66, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్తాన్‌ 94,ఇండియా 102, ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్థానాలు. అక్క‌ర‌కు రాని ఆయుష్మాన్ భార‌త్‌ ఆయుష్మాన్‌ భారత్‌ ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో భరించలేని ఆరోగ్య ఖర్చుతో ప్రజలు అప్పులపాలౌతున్నారు. మన దేశ జిడిపి పెరుగుతున్నా సామాన్య జనం చేతుల్లోకి ఆదాయం రావటంలేదు. ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. డిల్లీలో కుక్కలకు కూడా దహనవాటిక ఏర్పాటుచేశారట. మనిషి ఎంత ధనికుడై బ్రతికినా చివరికి సమాధికి చేరాల్సిందే. కొన్ని చోట్ల సంపన్నులు తమ శ్మశానాలను స్వర్గ పురాలుగా శుభ్రంగా అందంగా మార్చుకుంటున్నారు. పేద కులాలకు చాలా చోట్ల శ్మశానాలే లేవు. శ్మశానాలు ఉన్నా సరైన దారిలేక శవాలను మోస్తూ మరుభూమికి చేరవేయటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దారి పక్క రోడ్డు, డొంక, కాల్వ పోరంబోకు స్థలాలలోనే అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు. శ్మశానాల ఏర్పాటూ సంక్షేమ కార్యక్రమమే కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్ర‌బ‌లుతున్న అంట‌రానిత‌నం అంటరానితనం నిషేధమైనా ఇప్పటికీ అనేక రూపాల్లో ప్రబలిపోతోంది. ఆడవారిని హింస, బలవంతం, మోసాలు చేసి శ్రమదోపిడి చేస్తున్నారు. అప్పులిచ్చి బానిసలుగా మార్చి లైంగిక దోపిడి చేస్తున్నారు. పిల్లలను చదివించకుండా జీతానికి పనుల్లో పెడుతున్నారు. బలవంతపు పెళ్ళిళ్లు, బాల్య వివాహాలు చేస్తున్నారు. ఈ తప్పుడు పనులన్నీ బానిసత్వమే. అక్రమంగా రవాణా చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకులు పరువు హత్యలు చేస్తున్నారు. బాల్య వివాహాలు ఆపటానికి మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లు , పురుషులకు 21 ఏళ్లుగా పెంచారు. ప్రపంచంలో బాలికా వధువులు భారత్‌ లోనే ఎక్కువ. సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, పేరు చెప్పి కుమార్తె రజస్వల అయితే చాలు పెళ్ళి చేస్తున్నారు.15–19 ఏళ్ల ప్రాయంలోనే బాలికా వధువులు తల్లులవుతున్నారు. 18 ఏళ్లకు ముందే వివాహమాడుతున్న బాలికల సంఖ్య 36 శాతం దాకా ఉంది. మహిళలపై లైంగిక హింస జరుగుతోంది. మహిళలు మగవారిపై ఆధారపడి, వారికి బానిసలుగా ఉంటున్నారు. చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించి మైనర్‌ బాలికలు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురౌతున్నారు. మహిళలకు సమాన చదువు ఆస్తి హక్కు కావాలని జ్యోతిబా ఫూలే, గురజాడ,కందుకూరి,పెరియార్‌ రామస్వామి, అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి వారు చేసిన పోరాటాల ఫలితంగా మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయి. ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు అనే పాత వాగ్ధానం ప్రకారం స్వగృహ, టిడ్కో ఆత్మనిర్భర్‌ భారత్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన లాంటి ఎన్నో పధకాల కింద కోట్ల ఇళ్ళు మంజూరౌతున్నాయి. ఇల్లులేని వారి సంఖ్య ప్రతి జనాభా లెక్కల్లో పెరుగుతూనే ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో 1.12 కోట్ల ఇళ్లకు గిరాకీ ఉందట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసిచూడు అన్నారు. ఇల్లు లేకపోయినా పెళ్లి చేసుకున్నవారి ఆవేదన తగ్గాలి. ఇళ్ళు అందుబాటు ధరల్లో లేవు. పేదల ఇళ్లకోసం సరైనచోట భూమి దొరకక ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు పంచుతున్నారు. వాటిని మెరక చేసి ఇళ్ళు కట్టాలి. లేదా అపార్ట్ మెంట్లు కట్టి ప్లాటు ఇవ్వాలి. ఇళ్ల పథకాలు జాప్యం లేకుండా పూర్తి చేయాలి. భూమి ధర రోజురోజుకూ పెరిగి ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయాలు పెరుగుతాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం హ‌ర్ష‌దాయ‌కం జగన్ ప్రభుత్వం మహిళల పేరుతో 30.76 లక్షల కుటుంబాలకు ఇంటి పట్టాలు 2.62 లక్షల టిడ్కో ఇళ్ళు ఇవ్వటం హర్షదాయకం. తెలంగాణాలో డబల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లు కట్టించి పేదకుటుంబాలకు ఇవ్వటం పేదల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్ధిక భద్రత నిస్తుంది. కుటుంబాల ఆర్ధిక భద్రత పెరిగినప్పుడు అప్పులు తగ్గి రక్షణ పెరుగుతుంది. వివక్ష అణచివేత హింస బానిసత్వం తగ్గుతాయి. --(నూర్ బాషా రహంతుల్లా, ఏపీ రిటైర్ట్ స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ 6301493266))

24, డిసెంబర్ 2020, గురువారం

అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం సార్ధకమేనా ?


అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం
సార్ధకమేనా ?

ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోఉన్నారు. బానిసలను వెట్టి చాకిరీ నుండి  బయట పడేసే ఉద్దేశం తో 1949లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం నిర్వహించాలని  నిర్ణయించింది. బానిసత్వ నిర్మూలన జరగలేదు కానీ ఏటా డిసెంబర్‌ రెండో తేదీన ఇది దినోత్సవం లాగా జరుగుతుంది. ఎవరికీ ఏమీ అందకుండానే ప్రాణాంతక పురుగుమందులతోనే  ప్రపంచ నేల దినోత్సవం,అంతర్జాతీయ మానవ హక్కుల దినం జరిపేశారు. బానిసత్వం ఎన్నో రకాలుగా ఉంటుంది.శారీరక మానసిక ఆర్ధిక బానిసత్వాలు నిరంతరం చూస్తూనే ఉన్నాం.కులాలు మతాలు బలహీనుల్ని ఏలాయి.బానిసలు నేటికీ కొనసాగుతూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతులు వ్యవసాయ బిల్లుల రద్దుకోసం పోరాడారు.ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులన్నారు ,రైతులకు ఉత్పత్తి వ్యయానికి రెండు రెట్లు అధిక ఆదాయాన్ని అందిస్తామని వాగ్దానం చేసి కేంద్రం ఈ చట్టాల పట్ల రైతుల అభ్యంతరాలేమిటో తెలుసుకోవాలి.భారత ఆహార మార్కెట్‌ ను కార్పొరేట్ల పరం చేస్తారేమోననే రైతుల భయాన్ని పోగొట్టాలి.ఆర్థిక అసమానతలు పెరిగి ఉపాధి పడిపోయింది. ఉద్దీపనలవల్ల సామాన్యులకు లాభం జరగాలి.ఉపాధి కల్పనే మాంద్యానికి మందు. విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు చివరికి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగిస్తే కార్పొరేట్ల ఆస్తితో పాటు పేదలూ పెరుగుతారు. ఆఫ్రికాలోని నీగ్రోలను అమెరికాకు తరలించి బానిసలుగా మార్చి అమ్మారు. బానిసత్వం నేటికీ  వెట్టిచాకిరీగా  కొనసాగుతోంది.

 కరోనాతో ఉపాధి పోయి కొన్ని కోట్లమంది వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. ప్రపంచంలో కరోనాతో 17.27 లక్షలమంది ఇండియాలో1.46 లక్షలమంది చనిపోయారు.మంచి నీళ్ళు త్రాగి ఏలూరులో వందలమంది ఆసుపత్రి పాలయ్యారు.బిహార్‌లో మోనోక్రొటోఫాస్‌ అవశేషాలున్న మధ్యాహ్న భోజనాన్ని తిని పిల్లలు చనిపోయారు. దేశంలో సగం మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేమని మూడేళ్లు పడుతుందని భారత్ బయోటెక్ వాళ్ళు అంటున్నారు.జనం చేతిలో కాసులు గలగలలాడేలా ఉపాధి కల్పించాలి.కొనుగోలు సామర్థ్యం పెరిగితే గిరాకీ ఊపందుకొని మాంద్యం తగ్గుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వ్యవసాయ  చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. రైతులను నష్టపరిచే ఎటువంటి చట్టాలనూ తమ రాష్ట్రంలో అమలుచేసేది లేదని కెసిఆర్‌ ప్రకటించారు. లాభాల కోసం మాత్రమే పనిచేసే కార్పొరేట్ వ్యాపారులు దళారులుగా చేరకపోతే దేశంలో ఎక్కడ మంచి ధర దొరికితే అక్కడికెళ్లి రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చుననే చట్టం మంచిదే.కార్పొరేట్ల సంపదతో పాటే దేశంలో పేదరికమూ  పెరుగుతోంది.అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలే. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంత పురోగమించినా అన్నం పెట్టే రైతులు లేకుండా పూట గడవదు.వ్యవసాయం లేకుండా మానవాళికి బతుకు లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటంలేదు. రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క అమెజాన్లు, వాల్‌మార్టులు చిన్న చిల్లర దుకాణాలను ఛిద్రం చేసి మరీ ఎదుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలను దెబ్బ తీస్తుంది.ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకులను ఏర్పాటు చేసిన పెద్ద సంస్థలకు తక్కువ వడ్డీలకు రుణాలిస్తాయి.ప్రైవేటు బ్యాంకులు తిరిగిరాని రుణాలతో దివాళా తీస్తాయి. ప్రజల డిపాజిట్లకు గ్యారంటీ ఉండదు.ముప్పైలక్షలకోట్ల కరోనా ఆత్మనిర్భర ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చినా ప్రజల కొనుగోలుశక్తి పెరగలేదు.

పనికొచ్చే చదువులు లేవు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కళాసీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే  రెండు కోట్లమంది నిరుద్యోగులు పోటీపడ్డారు. రైల్వే గేట్‌మెన్‌, అసిస్టెంట్, గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు 82 లక్షల మంది పట్టభద్రులు బారులు తీరారు. పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు, పనే దొరకట్లేదని పట్టభద్రులూ బాధపడుతున్నారు. ఉపాధికల్పించలేని చదువుల కోసం విద్యారుణాలు మాత్రం ఇస్తున్నారు.మానవాభివృద్ధి సూచీల్లో చైనా 85 వ స్థానంలో ఉంటే ఇండియా 131 వ స్థానంలో ఉంది.ప్రపంచ భూమిలో ఇండియాకు  2.4శాతం ఉంటే జనాభా 16శాతం ఉంది. సంతానోత్పత్తి పెరుగుతూ జనసంఖ్య చైనాను దాటేలా ఉంది. మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుఉంటే బంగ్లాదేశ్‌(72.6), నేపాల్‌(70.8), భూటాన్‌(71.8) . పదివేల జనాభాకు మన దేశంలో వైద్యులు 9 మంది మాత్రమే. వైద్య కళాశాలల్లో సీట్లు చాలక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు వలసపోతున్నారు. వైద్య విద్య ఖర్చు భరించలేని ప్రజలతో వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి.గిరిజన జనాభా  ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 3 శాతమే . జనాభాకు తగినట్లు  మొత్తం 1500 విశ్వవిద్యాలయాలు కావాల్సి ఉండగా 993 మాత్రమే ఉన్నాయి. దాదాపు కోటి మంది ఏటా వృత్తి ఉపాధి నైపుణ్యం లేని డిగ్రీలు,రెండు లక్షల మంది ఎంఫిల్‌ , పిహెచ్‌డిలు పొందుతున్నారు. విద్య మీద పెట్టుబడిలో ప్రపంచంలో అమెరికా 27, చైనా 44 , సూడాన్‌ 157,ఇండియా 158, నమీబియా 159  వ స్ధానాల్లో ఉన్నాయి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో శ్రీలంక 66, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్తాన్‌ 94,ఇండియా  102, ఆఫ్ఘనిస్తాన్‌ 108 స్థానాలు. ఆయుష్మాన్‌ భారత్‌ ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో భరించలేని ఆరోగ్య ఖర్చుతో ప్రజలు అప్పులపాలౌతున్నారు. మన దేశ జిడిపి పెరుగుతున్నా సామాన్య జనం చేతుల్లోకి ఆదాయం రావటంలేదు. ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. డిల్లీలో కుక్కలకు కూడా దహనవాటిక ఏర్పాటుచేశారట.మనిషి ఎంత ధనికుడై బ్రతికినా చివరికి సమాధికి చేరాల్సిందే.కొన్ని చోట్ల సంపన్నులు తమ శ్మశానాలను స్వర్గ పురాలుగా శుభ్రంగా అందంగా మార్చుకుంటున్నారు.పేదకులాలకు చాలా చోట్ల శ్మశానాలే లేవు.శ్మశానాలు ఉన్నా సరైన దారిలేక శవాలను మోస్తూ మరుభూమికి చేరవేయటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.దారి పక్క రోడ్డు,డొంక,కాల్వ పోరంబోకు స్థలాలలోనే అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు.శ్మశానాల ఏర్పాటూ సంక్షేమ కార్యక్రమమే కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

 అంటరానితనం నిషేధమైనా ఇప్పటికీ అనేక రూపాల్లో ప్రబలిపోతోంది. ఆడవారిని హింస, బలవంతం, మోసాలు చేసి  శ్రమదోపిడి చేస్తున్నారు.అప్పులిచ్చి బానిసలుగా మార్చి లైంగిక దోపిడి చేస్తున్నారు. పిల్లలను చదివించకుండా జీతానికి పనుల్లో పెడుతున్నారు. బలవంతపు పెళ్ళిళ్లు,బాల్య వివాహాలు  చేస్తున్నారు. ఈ తప్పుడు పనులన్నీ బానిసత్వమే.  అక్రమంగా రవాణా చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకులు పరువు హత్యలు చేస్తున్నారు. బాల్య వివాహాలు ఆపటానికి మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లు , పురుషులకు 21 ఏళ్లుగా పెంచారు. ప్రపంచంలో బాలికా వధువులు భారత్‌ లోనే ఎక్కువ. సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు,పేరు చెప్పి  కుమార్తె రజస్వల అయితే చాలు పెళ్ళి చేస్తున్నారు.15–19 ఏళ్ల ప్రాయంలోనే బాలికా వధువులు తల్లులవుతున్నారు.18 ఏళ్లకు ముందే వివాహ మాడుతున్న బాలికల సంఖ్య 36 శాతం దాకా ఉంది. మహిళలపై లైంగిక హింస జరుగుతోంది.మహిళలు మగవారిపై ఆధారపడి, వారికి బానిసలుగా ఉంటున్నారు. చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించి మైనర్‌ బాలికలు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురౌతున్నారు.మహిళలకు సమాన చదువు ఆస్తి హక్కు కావాలని జ్యోతిబా ఫూలే, గురజాడ,కందుకూరి,పెరియార్‌ రామస్వామి, అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి వారు చేసిన పోరాటాల ఫలితంగా మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయి.ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు అనే పాత వాగ్ధానం ప్రకారం స్వగృహ,టిడ్కో ఆత్మనిర్భర్‌ భారత్‌,,ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన లాంటి ఎన్నో పధకాల  కింద కోట్ల ఇళ్ళు మంజూరౌతున్నాయి.కానీ ఇల్లులేని వారి సంఖ్య ప్రతి జనాభా లెక్కల్లో పెరుగుతూనే ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో 1.12 కోట్ల ఇళ్లకు గిరాకీ ఉంద. ఇల్లు కట్టి చూడు,పెళ్లి చేసిచూడు అన్నారు.ఇల్లు లేకపోయినా పెళ్లి  చేసుకున్నవారి ఆవేదన తగ్గాలి.ళ్ళు అందుబాటు ధరల్లో లేవు. పేదల ఇళ్లకోసం సరైనచోట భూమి దొరకక ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు పంచుతున్నారు. వాటిని మెరకచేసి ఇళ్ళు కట్టాలి.లేదా అపార్ట్ మెంట్లు కట్టి ప్లాటు ఇవ్వాలి. ఇళ్ల పథకాలు జాప్యం లేకుండా పూర్తి చేయాలి. భూమి ధర రోజురోజుకూ పెరిగి  ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయాలు పెరుగుతాయి.  జగన్ ప్రభుత్వం మహిళల పేరుతో 30.76 లక్షల కుటుంబాలకు  ఇంటి పట్టాలు 2.62 లక్షల టిడ్కో ఇళ్ళు ఇవ్వటం హర్షదాయకం.తెలంగాణాలో డబల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లు కట్టించి పేదకుటుంబాలకు ఇవ్వటం పేదల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్ధిక భద్రత నిస్తుంది. కుటుంబాల ఆర్ధిక భద్రత పెరిగినప్పుడు అప్పులు తగ్గి రక్షణ పెరుగుతుంది.వివక్ష అణచివేత హింస బానిసత్వం తగ్గుతాయి.

---నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6301493266 

 https://www.jaanojaago.com/2020/12/blog-post_883.html


 

19, డిసెంబర్ 2020, శనివారం

మూడు రాజ‌ధానులు త‌ర‌వాత‌ - ముందు అమరావతిలో కట్టడాలు పూర్తిచేయాలి

అమరావతిలో కట్టడాలు పూర్తిచేయాలి (వ్యూస్ 19.12.2020)

మూడు రాజ‌ధానులు త‌ర‌వాత‌ - ముందు అమరావతిలో కట్టడాలు పూర్తిచేయాలి

వినియోగంలోకి తేవాలి
కేంద్ర జోక్యం కోరుతున్న రైతులు
పొల్లు పోయిన ప్ర‌ధాని మాట‌
మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేసి, అమరావతి రైతుల ఉద్యమానికి సంవత్సరం నిండింది. మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యధాతదస్థితిని విధించింది. ఒక్క రాజధానినే కట్టలేనప్పుడు మూడు రాజధానులు ఎందుకు? అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని భూములిచ్చిన రైతులు వేడుకొంటున్నారు. కేంద్రాన్ని జోక్యం చేసుకోమంటున్నారు. ప్రజలు మూడు ప్రాంతాలలో కూడా మాకేంటి అని అడుగుతున్నారు. జోనులుపెట్టి అమరావతితోపాటు మిగతా ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని ఎమ్మేల్యేలు కోరుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపనకు మోడీ వచ్చారు. ఢిల్లీని తలదన్నిన రాజధానిని అమరావతిలో నిర్మిస్తామని చెప్పారు. ఆరున్నర సంవత్సరాల నుండి కేంద్రంలో బిజెపినే అధికారంలో ఉన్నారాజధానితో తమకు సంబంధమే లేదనీ రాజధాని రాష్ట్ర వ్యవహారమంటూ హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. కేంద్ర బడ్జెట్లో రాజధానికి, పోలవరం, కడప ఉక్కుకు నిధులు నిండుగా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్ లు రాలేదు. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి వస్తే రాజధానిని 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారట. మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు ఉంటాయని ఒకరు, మూడు రాజధానులు కాదు మూడు సచివాలయాలు ఉండాలని మరొకరు అంటున్నారు. రాజధానిని వెలగపూడిలోనే ఉంచి కర్నూలు విశాఖల్లో ప్రాంతీయ సచివాలయాలు, హైకోర్టు బెంచీలు, అసెంబ్లీ సమావేశాలు కూడా జరపాలని కొందరు కోరుతున్నారు. దేశంలో వంద రాష్ట్రాలు ఉండాలని బిజెపి కోరిక.

 
రాజ‌ధాని త‌ర‌లింపున‌కు డ‌బ్బులేవి?
అన్నీ ఒకే చోట కేంద్రీకరించాలనే చంద్రబాబు సింగపూర్ మోడల్‌ భూ సమీకరణ రాజధాని రాలేదు. అలాగే రాజధాని స్థలాల మార్పు తరలింపుకు డబ్బుల్లేవు. రాష్ట్రానికి అమరావతి సెంటర్లో సమ దూరంలో ఉండటమే ఆస్థలానికి ఒక ప్లస్ పాయింట్.రాజధాని ఒకే చోట ఉన్నా అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలి. విద్యా, వైద్య సంస్థలు, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. అదే నిజమైన వికేంద్రీకరణ. ఇప్పటిదాకా అమరావతిలో కట్టిన కట్టడాలు పూర్తిచేసి వాడుకోవాలి. రాజధానికి 40 వేల ఎకరాల పూలింగ్‌ అక్కరలేదు. ప్రపంచ స్థాయి రాజధాని అక్కరలేదు. ఒక పక్క జాతీయ రహదారి, మరోపక్క రైల్వేస్టేషన్ రెండూ ఉన్న మంగళగిరిలో వెయ్యి ఎకరాల స్థలం చాలు. తెనాలి, గుంటూరు, విజయవాడ అనే మూడు రైల్వే జంక్షన్ల మధ్య మంగళగిరి ఉంటుంది. మొదట మంగళగిరి క్రికెట్ స్టేడియం ప్రక్కనే సచివాలయ నిర్మాణానికి జీవో ఇచ్చి సన్నాహాలు చేసి తరువాత వెలగపూడికి అనవసరంగా మార్చారు. భౌగోళికంగా ఉండే సెంటర్ ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. విజయవాడ అలాంటి ప్రాధాన్యతగల సెంటరే.

 
సాష్టాంగ‌ప‌డిన బాబు విమ‌ర్శ‌లు
ఉద్దండరాయునిపాలెం శంకు స్థాపన ప్రదేశంలో సాంష్టాంగపడిన చంద్రబాబు ఇది దేవతల భూమి అన్నారు. విజ్ఞత ఉన్నవారెవరైనా రాష్ట్రానికి నడిబొడ్డున, అందరికీ సమాన దూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా ఉండాలనుకుంటారని అన్నారు. మూడు రాజధానులకు రిఫరెండంలో ప్రజలు ఒప్పుకుంటే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తలపెట్టిన అమరావతి రాజధాని కాలేకపోయింది. అమరావతి రాజధాని అయితే తమబిడ్డలు కోటీశ్వరులౌతారని స్టానిక రైతులు ఆశపడ్డారు. జగన్ ఉద్దేశించిన మూడు రాజధానులు వద్దని ఆప్రాంత రైతులు సంవత్సరం పాటు ఉద్యమం చేశారు. అప్పులతో ఏర్పడ్డ రాష్ట్రానికి గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర వెయ్యి ఎకరాల భూమి కొని సచివాలయం లాంటి ఆఫీసులు క్వార్టర్లు కట్టి ముగించమని ఆనాడే వడ్డే శోభనాద్రీశ్వరరావు,యలమంచలి శివాజీ లాంటి నేతలు సలహా ఇచ్చారు. ఒకేచోట ఇన్నివేల ఎకరాలు అనవసరమని కొందరు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రంనుండి ఎంత సహాయం చేస్తారో తెలియకుండానే ముందుకెళ్ళారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తామని చట్టంలో చెప్పినా దానిని పూర్తి చేయటానికి సహాయం కోసం ఇప్పటికీ జగన్ అడుగుతూనే ఉన్నారు. శివరామకృష్ణన్ కమిటీకి ప్రత్యామ్నాయంగా నియమించిన నారాయణ కమిటీ సూచన ప్రకారం కొత్త రాజధాని స్థలం ఎంపిక చేశారు. శంకుస్థాపనకు వచ్చిన మోడీ అడ్డుచెప్పకపోవటం, శాసనసభలో జగన్ కూడా సరే అనటంతో వేగంగా ముందుకెళ్లారు.

 
అమ‌రావ‌తికి మురుగు కాల్వ కూడా లేదు
అమరావతి రాజధానికి మూసీలాంటి మురుగుకాలవ కూడా లేదు.ఎక్కడి మురుగు అక్కడే భూమిలో కలవాలట. వరదల పాలైన హైదరాబాద్ ఎంత మురికి మహానగరమో తెలిసిందికదా? హైదరాబాదు మహానగరం లాగా పెట్టుబడి అంతా ఒకేచోట పొగుపడకుండా జిల్లాలు జోనుల మధ్య పంచాలి. ప్రజలు ఎక్కడికక్కడే మాప్రాంతం రాజధానికావాలి ,ప్రాంతీయ కేంద్రం కావాలి అని పోటీ పడుతున్నారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల వలసలతో గొప్పనగరాలు అయ్యాయి. నగరాలు ఏవీ ఒక్కసారి ఏర్పడవు. ఏళ్ల తరబడి పోగుబడిన అభివృద్ధే మహా నగరం. ఇప్పటికే లక్షల జనాభాతో పెద్దదయిన సముద్ర తీర నగరం విశాఖ. మూడు పక్కలే భూమి ఉన్న నగరంపై మరింత జనభారాన్ని మోపటం అనవసరం. ఎంత పెద్దనగరమైనా అది రైలు జంక్షను కాదు. రాష్ట్రానికి ఉత్తరాన ఒక అంచులో ఉంది. కర్నూలు కర్ణాటక అంచులో ఉంది. ఉత్తరాంధ్ర మధ్యస్థానం విజయనగరం, రాయలసీమ మధ్యస్థానం కడప. ముందు వీటిని రైల్వే జంక్షన్లుగా అభివృద్ధి చెయ్యాలి. భౌగోళికంగా మధ్యలో ఉండటం కూడా రాజధాని కేంద్రానికి మంచి అర్హతే. నాలాలు మార్చటానికైనా డబ్బులేదు. ఆనాడే అమరావతిలో కట్టిన భవనాలు వృధా అన్నారు కేసీఆర్. కట్టుబట్టలతో బయటికొచ్చిన వారు ఎవరైనా పొదుపు పాటిస్తారు. రాజధాని నగరానికి అవసరమైన భూములు కొనటం భవనాలు కట్టడంలో తమ స్తోమతను బట్టి ప్రణాళికలు కుదించుకుంటారు. వాడుకోకుండా ఇలా రైతుల భూములకు కౌలు ఎన్నేళ్లు కడతారు? రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు ? సమీకరించిన భూమిలో పెద్ద పెద్ద విద్యాసంస్థలకూ, వ్యాపారసంస్థలకూ మాత్రమే భూమి ఇచ్చారు.

 
అమ‌రావ‌తి కాద‌ని హైద‌రాబాద్‌లో బాబు ఇల్లు
సింగపూర్ మోడల్ అని తాత్కాలిక నిర్మాణాలు చేశారు. తాడేపల్లి లో జగన్ తన నివాసాన్ని కట్టుకుంటే చంద్రబాబు హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నారు. రాజధాని ఇన్నిరూపాలు సంతరించుకుంటుందని జగన్ మూడురాజధానులు అంటారని ఎవరూ ఊహించలేదు.వెలగపూడి నుంచి హైకోర్టు, సచివాలయం తరలిపోతాయంటే స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. కోటీశ్వరులమౌతామన్నరైతుల ఆశలు అడియాసలు అయ్యాయి. మూడు ప్రాంతాల వారికీ వారి వారి ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్న కోర్కెలు పెరిగాయి. విజయవాడ రాష్ట్రానికి నడిమద్యలో ఉన్నఅతి పెద్ద రైల్వే జంక్షన్. జిల్లా కేంద్రం కూడా కాలేకపోవటం లాంటి చరిత్ర చేసిన గాయాలను నెమరువేసుకుంటూ మౌనం దాల్చింది. రాజధాని అటు అమరావతీ కాదు ఇటు విజయవాడా కాదు. మధ్యలో వెలగపూడి. సచివాలయం, హైకోర్టు పోయి అసెంబ్లీ మాత్రమే నిలుస్తుందట.మొదట్లోనే ఈ గొడవలు జరిగితే ఇన్ని వేల ఎకరాల భూ సమీకరణ జరిగేది కాదు. శంకుస్థాపనకు ప్రధాని మోడీ స్వయంగా వచ్చిన అమరావతిని అసెంబ్లీకి మాత్రమే కుదిస్తారా అంటున్నారు. ఆనాటి నాయకుల వాగ్దానాలు కన్నకలలు నెరవేరక రైతులు పదేపదే కోర్టుకెక్కుతున్నారు. భూసమీకరణలో దాఖలైన చాలా కేసులు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. జగన్ రైతు నాయకులతో చర్చించి ఒక మధ్యే మార్గాన్ని వెల్లడించి నచ్చజెప్పటంలేదు.
వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మే అంటున్న సోము
సోము వీర్రాజు మాత్రం 2022 లోనే జమిలి ఎన్నికలు వచ్చినా లేకపోతే 2024 ఎన్నికల్లోనైనా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజధానిని అమరావతిలోనే ఉంచుతుందని చెబుతున్నారు. ఏడాది గడిచినా పెయిడ్ ఆర్టిస్టులతో రైతుల ఉద్యమం చేయిస్తున్నారని అంటున్నారు.ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, అయినవారికి భూములు తక్కువ ధరకే కట్టబెట్టారనీ ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాలు చేసిన దోషులను పట్టుకొని శిక్షించమని, కట్టిన భవనాలను కూలగొట్టవద్దనీ, రాజధానిని తరలించటానికి ముందే కట్టిన భవనాలను ఏం చేస్తారో చెప్పమనీ తెలుగుదేశం ,బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు కోరుతున్నాయి. జోన్లు ఏర్పడ్డాకే రాజధానుల తరలింపు జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి జిల్లాలకంటే పెద్దవైన జోనుల కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు. జోనల్ ఆఫీసులంటే సచివాలయానికి జిల్లాలకు మధ్య బ్రాంచీల వంటివి, హైకోర్టుకు బెంచీలలాంటివి. జోనల్ అధికారికి సచివాలయ స్థాయి అధికారాలు ఉంటాయి. జోనల్ కార్యాలయాలతో సచివాలయ స్థాయి సేవలు కూడా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి. హైకోర్టు, రాజధానుల తరలింపున‌కు సుప్రీం కోర్టు పార్లమెంటు ఒప్పుకోవాలి. జోనుల వల్ల అందరూ విశాఖకో కర్నూలుకో అమరావతికో ప్రయాణం కట్టనక్కరలేదు. ఎవరి జోన్ పరిధిలో వారికి పనులు జరుగుతాయి. నాలుగు జోనుల్లో కలక్టర్ల కంటే పైహోదా కలిగిన నలుగురు కమీషనర్లు రాజధానికి కలక్టర్లకు మధ్య వారధుల్లాగా పనిచేస్తారు.

 
3 రాజ‌ధానుల కంటే జోన్ కార్యాల‌యాలు చ‌వ‌క‌
మూడు రాజధాని నగరాలను కట్టడం కంటే ఒక్కచోటే నవనగరాలనిర్మాణం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టటం చవకైన పని, అన్నిప్రాంతాలకూ మరింత ప్రయోజనకరం. జోనులు ఏర్పడితే రాజధానుల ప్రాధాన్యత చాలావరకు తగ్గిపోతుంది.ప్రజలు అందరూ రాజధాని సెక్రటేరియట్ కు వెళ్లాల్సిన అవసరం,ప్రయాణ భారం తగ్గుతాయి.అన్ని శాఖల్లో 95 శాతం పనులు జోనుల్లోనే పూర్తవుతాయి.జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యలో,జోనుల కేంద్రాలు జోన్ మధ్యలో ఉంటే మంచిది. శివరామకృష్ణ , జి.ఎన్.రావు కమిటీలు కూడా జిల్లాల మధ్యలో దగ్గరగా జోనులు ఏర్పాటు చెయ్యమని సిఫారసు చేశాయి.హైకోర్టుకు బెంచీలు పెట్టమన్నాయి. విశాఖలోసచివాలయం పెడితే రాయలసీమ జిల్లాలకు దూరమని, కర్నూలులో హైకోర్టు పెడితే ఉత్తరాంధ్రకు దూరమని అక్కడి ప్రజలు తమ బాధను వ్యక్తంచేస్తున్నారు.మూడుప్రాంతాలలో సచివాలయానికి బ్రాంచీలు పెట్టవచ్చు. తమకు తమ ప్రాంతంలోనే పనులు జరగటం వల్ల మూడుప్రాంతాల ప్రజలు సంతృప్తి పడతారు. పనులు త్వరగా జరగాలి అంటే పని విభజన బాధ్యతల విభజన తప్పదు. రాష్ట్రానికి విజయవాడ సెంటర్ కాబట్టే అమరావతిని ఎంపిక చేశారు. కట్టిన భవనాలను కూలగొట్టకుండా ప్రభుత్వం వినియోగం లోకి తేవాలి. భూములిచ్చిన రైతులు నష్టపోకుండా అగ్రిమెంటు ప్రకారం పరిహారం చెల్లించాలి. ముందుగా అమరావతిలో కట్టిన కట్టడాలు వృధా కాకుండా పూర్తిచేసి వాడుకోవాలి.

- (నూర్‌బాషా ర‌హ్మ‌తుల్లా, ఏపీ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266)