ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2013, బుధవారం

అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉండాలి?


 
అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉండాలి?

నూర్ బాషా రహంతుల్లా 9948878833

                       ఇప్పుడు అన్నిపార్టీలవాళ్ళూ అసెంబ్లీ పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచాలనే పల్లవిని అందుకున్నారు.పోటాపోటీగా అడుగుతున్నారు.సమన్యాయం సమైక్యం ప్రత్యేకం అనే తేడాలేకుండా ప్రతిపార్టీలోని కొందరు నాయకులు ఏదో ఒకరీతిలో ఈ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణాలోని 17 లోక్‌సభ స్థానాలలో కూడా రెండేసి అసెంబ్లీ స్థానాలను పెంచి మొత్తం అసెంబ్లీ స్థానాలను  119 నుండి 153 కు పెంచాలని మర్రి శశిధరరెడ్డి కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 153కు పెంచాలి. లేదంటే... తెలంగాణ కూడా జార్ఖండ్‌లాగా రాజకీయ అస్థిరతకు నిలయమవుతుంది''.అని తెలంగాణ నేతలు కేంద్ర మంత్రుల బృందానికి చేసిన విన్నవించారు. 200 చేయాలని తెలంగాణా తెలుగుదేశం నేతలు కోరుతున్నారు.రాష్ట్రం లో మొత్తం స్థానాలు 800 కు పెంచి ఆతరువాతే రాష్ట్రవిభజనకు పూనుకోండి అని సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి అంటున్నారు.తెలంగాణా రాష్ట్ర సమితి నేతలుకూడా స్థానాలు పెంచాలనే కోరుతున్నారు.లోక్ సభ అసెంబ్లీ స్థానాలను పెంచే ఆలోచన ఏదీ లేదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి తేల్చేశారు.అయితే ఈ కోర్కెను కేంద్ర మంత్రుల బృందం ఆమోదించినట్లు కూడా వార్తలొచ్చాయి.  

ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు?

                         ఒక్కొక్కరిదీ ఒక్కో అవసరం.ఒక్కో వాదన.రాష్ట్ర విభజన స్థానాలు గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉత్తరప్రదేశ్‌నుంచి విడదీసిన 22 సీట్లను 70కి పెంచారు. అదే రీతిలో ఇక్కడాఅసెంబ్లీ స్థానాలు   పెంచాలని  మర్రి శశిధరరెడ్డి లాంటి టీ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ  సీట్లను పెంచాలని కోరటంలో తప్పులేదుకానీ   తెలంగాణ బిల్లు నిర్ణయాత్మక దశకు వచ్చిన తరుణంలో అడగటంవలన తెలంగాణా ఏర్పాటు ఆలస్యం అవుతుందేమో అనే భయం తెలంగాణావాదుల్లో బయలుదేరింది. రాష్ట్ర విభజన ప్రక్రియను కాలయాపన చేసి సాగదీయటానికి కొందరు,పెరిగిన జనాభాకు తగ్గట్లుగా స్థానాల సంఖ్య లేదని కొందరు, ఇప్పుడున్న 119 మందీ ఏకగ్రీవంగా తెలంగాణా పక్షాన ఓటేసినా బిల్లు గెలవదు  కాబట్టి తెలంగాణా బిల్లును గెలిపించుకోవాలంటే స్థానాల సంఖ్య పెరగాలని కొందరు, భవిష్యత్తులో పెరిగే జనాభాకు ధీటుగా స్థానాల సంఖ్య పెంచాలని కొందరు రకరకాల వాదనలు లేవనెత్తుతున్నారు.

ఏమిటి పద్ధతి?
                       ఒక రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు పెంచాలంటే... 'నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్' (డీలిమిటేషన్) ఏర్పాటు చేయాల్సిందే. అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తే సరిపోతుంది. గతంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచారు. మిజోరాంలో 40, సిక్కింలో 32 తప్ప దేశంలోని ప్రతి రాష్ట్రంలో కనీసం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్‌లో 23 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండేవి.వాటిని 70కి పెంచుకున్నారు. దీనికోసం ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం ఈ తీర్మానాన్ని రాష్ట్రపతికి నివేదిస్తే ,రాష్ట్రపతి దానిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేయగా ఉత్తరాఖండ్‌లోని స్థానాలు 23 నుంచి 70కి పెరిగాయి. అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి కసరత్తు చేసి జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా అసెంబ్లీ స్థానాలను ఇలాగే పెంచుకోవచ్చు.పార్లమెంటు సీట్లను పెంచుకునేందుకు మాత్రం ప్రత్యేకంగా డీ లిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలీ. మన దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి నాలుగుసార్లు డీ లిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. తాజాగా 2008లో పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. మళ్లీ 2020లో మరో కమిషన్‌ను నియమిస్తారు. కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారిని నియమిస్తారు. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎక్స్అఫిషియో కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసోసియేట్ సభ్యులుగా వ్యవహరిస్తారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపై కమిషన్ తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు. కోర్టులకు కూడా వెళ్లలేరు. 2008లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సరిహద్దులను పునర్‌వ్యవస్థీకరించారేగానీ, వాటి సంఖ్యను ఏ రాష్ట్రంలోనూ పెంచలేదు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో సీట్ల సంఖ్య తగ్గితే, ఆ మేరకు మరో ప్రాంతంలో పెరిగాయి.

ఇప్పుడీపని చేపడితే ఏంజరుగుతుంది?
                  తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచాలంటే రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఈ అంశం చేర్చాలి. ఎన్నికల కమిషన్ డీలిమిటేషన్ ప్రక్రియను ఇప్పుడు చేపట్టినా ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగిసేలోపు ఈ ప్రక్రియ పూర్తికాదు.అంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి విడదీసే తెలంగాణ అసెంబ్లీని ప్రొవిజినల్ అసెంబ్లీగా బిల్లులో పొందుపరచాలి. ఒక రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను పెంచేంత వరకు ప్రస్తుతమున్న అసెంబ్లీలోని ఎమ్మెల్యేలను ప్రొవిజినల్ అసెంబ్లీ ద్వారా యధావిధిగా కొనసాగించవచ్చు.ప్రొవిజినల్ అసెంబ్లీకి కాలపరిమితి ఉండదు. అదనపు స్ధానాలను ఎన్నికల కమిషన్ నిర్దారించి ప్రకటించే వరకు అసెంబ్లీకి ఎన్నికలు జరపనక్కరలేదు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ గడువు 2014 మే నెలతో ముగుస్తుంది.  రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ గడువు ముగియగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాని విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రంలో ప్రొవిజినల్ అసెంబ్లీ అని పేర్కొంటే శాసనసభ ఎన్నికలకు గడువుతో సంబంధం ఉండదు. అసెంబ్లీ స్థానాలను పెంచడం, తగ్గించడం చేసే క్రమంలో సమయం సరిపోకపోతే వీలయినన్ని రోజులు అసెంబ్లీ కాలపరిమితిని పొడిగించవచ్చు. ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో ఉత్తరప్రదేశ్ పునర్విభజన చట్టం-2000’లోని సెక్షన్ 12(1)లో పొందుపరిచారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీని ప్రొవిజినల్ అసెంబ్లీగా పేర్కొని 22 అసెంబ్లీ స్థానాలను 70 కి పెంచిన తరువాతే నూతన రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది.

ఒక లోక్‌సభ స్ధానానికి ఎన్ని అసెంబ్లీ స్థానాలుండాలి?
                ఒక లోక్‌సభ స్థానానికి ఇన్ని అసెంబ్లీ స్ధానాలుండాలనే శాస్త్రీయ నియమమేదీ లేదు.ఒక్కోరాష్ర్టంలో ఒక్కో విధానముంది. ఉత్తర ప్రదేశ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలుండగా బీహార్‌లో ఆరు ఉన్నాయి.తెలంగాణలో ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి.తెలంగాణాలోని 17 లోక్‌సభ స్థానాలలో కూడా రెండేసి అసెంబ్లీ స్థానాలను పెంచి మొత్తం అసెంబ్లీ స్థానాలను  119 నుండి 153 కు పెంచాలని మర్రి శశిధరరెడ్డి కోరారు. 

2013 లో దేశంలోని జిల్లాలు, పార్లమెంటు,అసెంబ్లీ స్థానాల  వివరాలు


క్రమ సంఖ్య
రాష్ట్రం
పార్లమెంటు సభ్యుల సంఖ్య
శాసన సభ సభ్యుల సంఖ్య
వైశాల్యం చ.కి.మీ.
జనాబా
2013లో జిల్లాల సంఖ్య
జిల్లాలు సగటు విస్తీర్ణం చ.కి.మీ
జిల్లాల వారీగా సగటు జనాబా
MP సగటు విస్తీర్ణం చ.కి.మీ
MP సగటు జనాబా
రాజ్యసభ సభ్యులు

1
ఆంధ్ర ప్రదేశ్
42
294
275069
84665533
23
11960
3681110
6549
2015846
18

2
అరుణాచల్ ప్రదేశ్
2
60
83743
1382611
17
4926
81330
41872
691306
1

3
అస్సాం
14
126
78438
31169272
27
2905
1154417
5603
2226377
7

4
బీహార్
40
243
94163
103804637
38
2478
2731701
2354
2595116
16

5
చత్తీస్ గడ్
11
90
136034
24540196
27
5038
908896
12367
2230927
5

6
గోవా
2
40
3702
1457723
2
1851
728862
1851
728862
1

7
గుజరాత్
26
182
196024
60383628
33
5940
1829807
7539
2322447
11

8
హర్యానా
10
90
44212
25353081
21
2105
1207290
4421
2535308
5

9
హిమాచల్ ప్రదేశ్
4
68
55673
6856509
12
4639
571376
13918
1714127
3

10
జమ్ము కాశ్మీర్
6
87
222236
12548926
22
10102
570406
37039
2091488
4

11
జార్ఖండ్
14
81
79714
32966238
24
3321
1373593
5694
2354731
6

12
కర్ణాటక
28
224
191791
61130704
30
6393
2037690
6850
2183239
12

13
కేరళ
20
140
38863
33387677
14
2776
2384834
1943
1669384
9

14
మధ్య ప్రదేశ్
29
230
308000
72597565
51
6039
1423482
10621
2503364
11

15
మహారాష్ట్ర
48
288
307713
112372972
35
8792
3210656
6411
2341104
19

16
మణిపూర్
2
60
22327
2721756
9
2481
302417
11164
1360878
1

17
మేఘాలయ
2
60
22429
2964007
11
2039
269455
11215
1482004
1

18
మిజోరాం
1
40
21081
1091014
8
2635
136377
21081
1091014
1

19
నాగాలాండ్
1
60
16579
1980602
11
1507
180055
16579
1980602
1

20
ఒడిస్సా
21
147
155707
41947358
30
5190
1398245
7415
1997493
10

21
పంజాబ్
13
117
50362
27704236
22
2289
1259283
3874
2131095
7

22
రాజస్ధాన్
25
200
342239
68621012
33
10371
2079425
13690
2744840
10

23
సిక్కిం
1
32
7096
607688
4
1774
151922
7096
607688
1

24
తమిళనాడు
39
234
130058
72138958
32
4064
2254342
3335
1849717
18

25
త్రిపుర
2
60
10492
3671032
8
1312
458879
5246
1835516
1

26
ఉత్తరప్రదేశ్
80
403
240928
199581477
75
3212
2661086
3012
2494768
31

27
ఉత్తరఖాండ్
5
70
53484
10116752
17
3146
595103
10697
2023350
3

28
పశ్చిమబెంగాల్
42
294
88752
91347736
19
4671
4807776
2113
2174946
16


మొత్తం
530
4020
3276909
1189110900
655
5003
1815436
6183
2243605
229


కేoద్రపాలిత ప్రాంతాలు











1
అండమాన్ మరియు నికోబార్
1

8249
379944
3
2750
126648
8249
379944


2
చండీగడ్
1

114
1054686
1
114
1054686
114
1054686


3
దాద్రా మరియు నగర్ హవేలి
1

491
342853
1
491
342853
491
342853
3

4
డామన్ అండ్ డయ్యూ
1

112
242911
2
56
121456
112
242911


5
లక్ష్వద్వీప్
1

32
64429
1
32
64429
32
64429
1

6
డిల్లీ
7
70
1483
16753235
9
165
1861471
212
2393319


7
పుదుచ్చేరి
1
30
479
1244464
4
120
311116
479
1244464



నామినేటెడ్ సభ్యులు









12


మొత్తం
13
100
10960
20082522
21
522
956311
843
1544809



ఇండియా
543
4120
3287869
1209193422
676
4864
1788748
6055
2226876
245








లోక్ సభ స్థానాల సంఖ్య  ఎందుకు పెరగాలి?

                 ప్రస్తుతం మన పార్లమెంటులో 542 మంది లోక్ సభ సభ్యులు,245 మంది రాజ్య సభ సభ్యులూ ఉన్నారు. 1985 లో దేశంలో 439 ఉండే జిల్లాల సంఖ్య ఇప్పుడు 676 కు పెరిగింది.కానీ లోక్ సభ స్థానాల సంఖ్య పెరగనేలేదు. పెరిగిన జనాభాకు తగిన నిష్పత్తిలో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని వివిధ పార్టీలు ప్రజాప్రతినిదులూ  చాలాకాలం నుంచి కోరుతున్నారు .లోక్ సభ స్థానాల సంఖ్య 1952 నుండీ మారుతూనే వస్తోంది. 1952 లో 489, 1957  లో 494, 1967 లో 520 , 1971 లో 518, 1977 లో 542, లోక్ సభ స్థానాలుండగా 1973 లో 31 వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభస్తానాల సంఖ్యను 545 కు పెంచారు.1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 2001 దాకా మార్చకూదదని తీర్మానించారు.అలాంటి మొండితీర్మానం మందబలమున్న ఏ పార్టీ అయినా చేయించగలదుగానీ జనాభా పెరగకుండా ఏ పార్టీ ఆపగలదు?1971 జనాభా లెక్కల ప్రకారం ప్రతి లోక్ సభ నియోజక వర్గంలోను గరిష్టం ఏడున్నర లక్షల మంది ప్రజలుండగా ఈనాడు ఆ సంఖ్య 23 లక్షలకు చేరుకుంది. ఎనిమిది లక్షల మందికి ఒక లోక్ సభ నియోజకవర్గం చొప్పున నిర్ణయించినా వందలాది స్థానాలను అదనంగా ఏర్పాటు చేయవలసి వస్తుంది. లోక్ సభ నియోజకవర్గాల వైశాల్యం కూడా అలవి మాలిన రీతిలో సగటున ఆరువేల చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ వైశాల్యాన్ని సగానికి సగం తగ్గించడం అవసరం. కనుక నియోజకవర్గాల సంఖ్య పెంచేది లేదని మొండిపట్టు పట్టకుండా పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే విషయాన్ని పరిశీలించడం న్యాయం. ఎన్నికల సంస్కరణలలో భాగంగా రిజర్వుడు నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిని ప్రవేశ పెట్టాలనే ఆలోచన మంచిదే.ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధి ఉండాలనో లేక ఇన్ని లక్షల జనాభా ఉండాలనో ఒక శాస్త్రీయ ప్రాతిపధిక ఏర్పాటు చేయలేదు.అందుకే ఈ డిమాండు పదేపదే వినిపిస్తోంది.

ఎందుకు పెంచడంలేదు?

                      1971 జనాభా లెక్కల ప్రకారం 543 లోక్ సభ నియోజకవర్గాలను ఏర్పాటుచేసి 2001 వరకూ ఆ సంఖ్యను మార్చకూడదని 1976 ఎమర్జెన్సీ కాలంలో 42రాజ్యాంగ సవరణ చేశారు.మళ్ళీ  కొత్త జాతీయ జనాభా విధానంలో భాగంగా 2026 వరకూ లోక్ సభ స్థానాల సంఖ్య  పెంచకూడదని 2000 లో మొండిగా తీర్మానించారు.81,82 ఆర్టీకిల్స్ ప్రకారం ప్రతిపదేళ్ళకొకసారి పెరగాల్సిన నియోజకవర్గాల సంఖ్యను అలా 56 ఏళ్ళపాటు పెరగకుండా జేశారు. కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసే రాష్ట్రాలు నిరుత్సాహపడతాయనే  లా కమీషన్ సిఫారసును అడ్డం పెట్టుకొని ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 2045 నాటికి ఇద్దరు పిల్లలతో కూడిన కుటుంబాలను పెంచి జనాభాను స్థిరీకరిస్తారట! ఇది సాధించినా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒకే జనసాంధ్రత ఎలా పెరుగుతుంది ? నీటి సౌకర్యం బాగా ఉండి, పంటలు పండే ప్రాంతాల్లో, జీవనోపాధి లభ్యమవుతుంది గనుక జన సాంధ్రత అధికంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో అధిక జనాభాకు కారణం జీవనదులే. నియోజక వర్గాలు పెరిగితే దేశం చీలిపోదు గానీ అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధుల పనితనం మెరుగుపడుతుంది.

ఎంత కుటుంబనియంత్రణ చేయించినా జనాభా 2.5 శాతం చొప్పున పెరుగుతూనే ఉంది.దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే  మనుషులోయ్  అనే సూక్తిని విటతటం చేసి,జనాన్ని చీదరించుకుంటూ ఈ  దేశంలో పుట్టటమే మహా పాపం అనుకునే దశకు చేర్చారు.మనుషుల్ని వదిలేసి వట్టి మట్టినే పాలిస్తున్నారు.ప్రజలకు విలువనివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు? జనాభా వల్ల శ్రామిక వనరులు పెరుగుతాయి.శ్రమవల్ల సంపద పెరుగుతుంది.ఒక మనిషి తనకయ్యే ఖర్చుకంటే ఎక్కువగా సంపాదించే పరిస్థితుల్ని దేశంలో కల్పిస్తే వలసలు ఆగిపోయి సంపద మిగులుతుంది.జనాభా పెరిగేకొద్దీ వారి అవసరాలకు అనుగుణమైన నిష్పత్తిలో రాజకీయ ప్రతినిధులూ,ఉద్యోగులూ పెరగాలి.సామాజికన్యాయం కోసం ఆయా ప్రాంతాల ప్రజలవాణిని శాసన సభల్లో వినిపించటానికి ,వారివారి అవసరాలను ఏకరువు పెట్టటానికి ,ఆయాప్రాంతాల అభివృద్ధి పనులు సాధించటానికి,ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ప్రతినిధులు అవసరం.వారు జనానికి అందుబాటులో ఉండాలి.1971 జనాభా లెక్కల ప్రకారం ఏర్పాటు చేసిన నియోజక వర్గాల సంఖ్య 2026 దాకా పెంచకూడదనటం ప్రజా కంటకం ,అప్రజాస్వామికం,అభివృద్ధినిరోధకం అవుతుంది.ఓటు వేయించుకునేటప్పుడు ప్రజలకు ఎంతో దగ్గరగా చ్చే  ప్రజా ప్రతినిధులు ,ఎన్నికయ్యాక ప్రజలకు అందనంత దూరంలో ఉండాల్సిరావటమే మన దౌర్భాగ్యం.ఒకనాటి భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గ పరిధిని ఒకసారి పరిశీలించి చూడండి.ఎంపీని జనం కలవాలన్నా నియోజకవర్గంలో ఎంపీ తిరగాలన్నా ఎంతదూరమో ఎంత భారమో! కాబట్టి ఈనాడు కావలసింది ఎంపీలు ఎమ్మెల్యేల జీత భత్యాలు పెంచడం కాదు. వాళ్ళ జీతాలు తగ్గించైనాసరే ఎంపీలు ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలి.పార్లమెంటును దక్షిణాదిన కూడా ఏర్పాటు చెయ్యాలి.



పాత కమిటీల సిఫారసులనైనా పట్టించుకోవాలి

                  నియోజకవర్గాల పునర్విభజన ప్రతి పదేళ్ళకొకసారి క్రమం తప్పకుండా జనాభాలెక్క ఆధారంగా జరుగుతూనే ఉండాలని దినేశ్ గోస్వామి కమిటీ కోరింది.అలాగే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ క్రమం తప్పకుండా నిర్వహించే బాధ్యతను ఎన్నికలకమీషన్ కు అప్పగించాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ ఏం.ఎస్.గిల్ ఎప్పుడో కోరారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సరిగా సకాలంలో జరపనందువలన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ,జనాభా దృష్టితో చూసినట్లయితే నియోజకవర్గాల్లో సమతుల్యత లేదని గిల్ చెప్పారు.కొన్ని నియోజకవర్గాల్లో 3 లేదా 4 లక్షల ఓటర్లు ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో 10 నుండి 15 లక్షల వోటర్లు ఉన్నారని చెప్పారు.ఉదాహరణకు ఔటర్ డిల్లీలో 28 లక్షల ఓటర్లుంటే ,చాందినీ చౌక్ లో 4.5 లక్షలమందే ఉన్నారనీ ఇది అసంబద్దమనీ ఆనాడే వాపోయారు.ఇలా జనాభాలో తేడాలున్నప్పటికీ నియోజకవర్గాలకు విడుదల చేసే మొత్తం మాత్రం ఒకేరకంగా ఉండటంతో ఎక్కువ జనాభా ఉన్న నియోజకవర్గాలకు చాలినన్ని అభివృద్ధి నిధులు అందటం లేదని విడమరిచి మరీ చెప్పారు.ఇప్పుడు కూడా సిక్కిం,గోవాలో 6,7 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే బీహార్,రాజాస్థాన లలో 26,27 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నాడు.2011 నాటి మన దేశ జనాభాను బట్టి చూస్తే పది లక్షలమందికి ఒక ఎంపీ చొప్పున 1190 మంది ఎంపీలు కావాలి. అలాగే మన రాష్ట్రంలో 85 మంది ఎంపీలుండాలి. రాజ్యసభను తీసేసి 250 మంది రాజ్య సభ సభ్యులకు బదులు లోక్ సభ సభ్యుల్నే పెంచుకోవచ్చు. లా కమీషన్ కూడా 25 శాతం లోక్ సభ ,అసెంబ్లీ స్థానాలు పెంచాలని,ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను కూడా నామినేట్ చెయ్యకూడదనీ 2000 లో సిఫారసు చేసింది.కానీ కేంద్రం కనీసం ఈ మాత్రం పెంపుదలకూడా చేయకుండా 2026 వరకూ దేశాన్ని స్తంబింపజేసింది.2009 వరకూ మన దేశంలో 15 లోక్ సభ ఎలక్షన్లు జరిగాయి. 2014 లో 16 వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి.2001 జనాభాలెక్కలప్రకారం లోక్ సభ ,శాసనసభ నియోజకవర్గాల పరిధుల్ని మార్చారుగానీ వాటి సంఖ్యను పెంచలేదు.కారణం 1976 లో చేసిన రాజ్యాంగ సవరణే. ఉత్తర ప్రదేశ్,భీహార్ లాంటి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు  లోక్ సభ సీట్లు ఎక్కువగా వస్తాయనీ ,కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని బాగా అమలుచేసి జనాభాను తగ్గించుకునే రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయనే వింతవాదనతో  ఈ సవరణ చేశారు.రాజ్యాంగం లోక్ సభ సభ్యుల సంఖ్యపై విధించిన  పరిమితి 552.ఈ పరిమితి 1951 నాటిది.ఇన్నేళ్ళకాలంలో పార్లమెంటు సభ్యులు వారి జీతభత్యాలు బాగానే పెంచుకున్నారుగానీ ,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్ సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచటానికి మాత్రం ఎందుకోగానీ ధైర్యం చేయలేకపోయారు.పైగా 2026 వరకూ మా జోలికి ఎవరూ రాకూడదన్నట్లుగా  తమ కోటలు ముక్కలుకాకుండా పదిలం చేసుకున్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళన కోసం లాకమీషన్ 1999లోనే 8 సూచనలు చేసిందిః
1.లోక్ సభ అసెంబ్లీ సీట్ల సంఖ్య 25% పెంచాలి
2.5%కంటే ఎక్కువ ఓట్లువచ్చిన పార్టీల అభ్యర్దులనే ఎంపిక అయినట్లు ప్రకటించాలి.
3.ఇండిపెండెంట్లు ఉండకూడదు.
4.ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న కూటమినుండి వేరుపడితే ఆ పార్టీ తన స్థానాలన్నీ కోల్పోతుంది.రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు లో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టంలో ప్రతి కూటమినీ ఒకే పార్టీగా పరిగణించాలి.పార్టీ వదిలితే సీటూ
పోతుంది. 
5.అవిశ్వాస తీర్మానంతోపాటే వారసుడిమీద విశ్వాసంకూడా విధిగా ప్రకటించాలి.రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య రెండేళ్ళ ఎడం ఉండాలి.
6.ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ఎంపీలను నియమించే అధికరణను రద్దు చెయ్యాలి.
7.పార్టీల జమాఖర్చులను నియంత్రించాలి.నిబందనలను అతిక్రమించే పార్టీలను డిబార్ చెయ్యాలి.పార్టీల సంస్థాగత ఎన్నికలు క్రమంతప్పకుండా జరపాలి.
8.హత్య మానభంగం లాంటినేరారోపణలతో చార్జి షీటు దాఖలైన వారిని ,దిగువకోర్టులో అభియోగాలు నమోదైన వారిని ఎన్నికల్లో పాల్గొననివ్వకూడదు.
పనిలోపనిగా ఈ సూచనలన్నీ అమలులోకి వచ్చేలా ప్రభుత్వం చట్టాల మార్పిడికి ప్రయత్నించాలి.
 http://www.suryaa.com/opinion/edit-page/article-160879
 సూర్య 30.11.2013

https://www.facebook.com/photo.php?fbid=672278706137456&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

ఆంధ్రపత్రిక  5.12.1990

గీటురాయి 4.1.1991

  గీటురాయి 19.4.1996 
 గీటురాయి 20.2.1998 

 గీటురాయి 17.9.1999 
 
గీటురాయి 10.3.2000
గీటురాయి13.12.2013