ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, మార్చి 2019, సోమవారం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఎప్పుడు?


ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఎప్పుడు?

1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418. 2015 లో 678.1985 లో 425. లోక్ సభ సభ్యుల సంఖ్య 543.    ఇప్పుడు దేశవ్యాప్తంగా జిల్లాలసంఖ్య  725 కు పెరిగింది. అంటే 1983 నుండి 2019 వరకు 36 ఏళ్ళలో దేశంలో  307 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కానీ  మన రాష్ట్రంలో ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పడలేదు.
భారతదేశంలో జిల్లాలు
జనాభాలో ఆంధ్రా కంటే చిన్న రాష్ట్రాలైన అరుణాచలప్రదేశ్  లో 24 జిల్లాలు, పంజాబ్ లో 22,హర్యానాలో 22,చత్తీస్ గడ్ లో 27 జిల్లాలు, జార్ఖండ్ లో 24 జిల్లాలు, అస్సాం లో 33జిల్లాలు , తమిళనాడులో 32 జిల్లాలు, కర్ణాటకలో 28 జిల్లాలు, ఒరిస్సాలో 30 జిల్లాలు,కేరళలో 14,మణిపూర్ లో 16 ,తెలంగాణాలో ౩౩ జిల్లాలు ఉన్నాయి.
అలాగే విస్తీర్ణంలో ఆంధ్రా కంటే చిన్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో 51 , తమిళనాడులో 32, రాజస్ధాన్ లో 33, కర్ణాటక లో 30, గుజరాత్ లో 33 , ఒడిషా లో 30, అస్సాం లో 27, చత్తీస్ గడ్ లో 27 తెలంగాణాలో ౩౩ జిల్లాలున్నాయి.రాష్ట్రాల విభజన లాగానే  జిల్లాల విభజనకు కూడా ఒక ప్రామాణిక సూత్రం గానీ,శాస్త్రబద్దమైన విధానం గానీ,ఒక ప్రాతిపదికగానీ రాజ్యాంగం లో నిర్ణయించలేదు.ప్రాతిపధిక జనాభానా ,వైశాల్యమా అనే సూత్రమెక్కడా లేదు. 

భారతదేశంలో జిల్లాలు
వరుస సంఖ్య
రాష్ట్రం
జిల్లాల సంఖ్య
లోక్ సభ స్థానాలు
రాష్ట్ర జనాభా
జిల్లాల సగటు జనాభా
రాష్ట్ర   విస్తీర్ణం చ.కి.మీ.
జిల్లాల సగటు విస్తీర్ణం చ.కి.మీ.
1
13
25
4,93,86,799
37,98,985
1,60,205
12323
2
24
2
13,83,727
57,656
83,743
3489
3
33
14
3,11,69,272
9,44,523
78,438
2377
4
38
40
10,40,99,452
27,39,459
94,163
2478
5
ఛత్తీస్ గడ్
27
11
2,55,45,198
9,46,118
1,35,191
5007
6
2
2
14,58,545
7,29,273
3,702
1851
7
33
26
6,04,39,692
18,31,506
1,96,021
5940
8
22
10
2,53,51,462
11,52,339
44,200
2009
9
12
4
68,64,602
5,72,050
55,673
4639
10
22
6
1,25,41,302
5,70,059
2,22,236
10102
11
24
14
3,29,88,134
13,74,506
79,714
3321
12
30
28
6,10,95,297
20,36,510
1,91,791
6393
13
14
20
3,34,06,061
23,86,147
38,863
2776
14
52
29
7,26,26,809
13,96,669
3,08,252
5928
15
36
48
11,23,74,333
31,21,509
3,07,713
8548
16
16
2
27,21,756
1,70,110
22,327
1395
17
11
2
29,66,889
2,69,717
22,429
2039
18
8
1
10,97,206
1,37,151
21,081
2635
19
11
1
19,78,502
1,79,864
16,579
1507
20
30
21
4,19,74,218
13,99,141
1,55,707
5190
21
22
13
2,77,43,338
12,61,061
50,362
2289
22
33
25
6,85,48,437
20,77,225
342240
10371
23
4
1
6,10,577
1,52,644
7,096
1774
24
33
39
7,21,47,030
22,54,595
1,30,058
3941
25
8
2
36,73,917
4,59,240
10,486
1311
26
75
80
19,98,12,341
26,64,165
2,40,928
3212
27
13
5
1,00,86,292
7,75,869
53,483
4114
28
23
42
9,12,76,115
39,68,527
88,752
3859
29
33
17
3,51,93,978
11,35,290
1,14,840
3480

కేంద్రపాలిత ప్రాంతం






1
3
1
3,80,581
1,26,860
8249
2750
2
1
1
10,55,450
10,55,450
114
114
3
1
1
3,43,709
3,43,709
491
491
4
2
1
2,43,247
1,21,624
112
56
5
1
1
64,473
64,473
32
32
6
11
7
1,67,87,941
15,26,176
1,483
135
7
4
1
12,47,953
3,11,988
479
120
36
మొత్తం
725
543
1,21,08,54,977
16,77,084
32,87,263
4534

తెలంగాణలో జిల్లాలు
 2016 అక్టోబరులో తెలంగాణాలో ఒక్కసారే 23 కొత్తజిల్లాలు ఏర్పాటయ్యాయి.జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది.111 ఏళ్ల తరువాత తెలంగాణాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణాలో పాలనా వ్యవస్థలో భారీ అధికార వికేంద్రీకరణ జరిగింది.38 ఏళ్ల తర్వాత 23కొత్త జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి , రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి.ఈ జిల్లాల పునర్విభజనను చాలా మంది  ఎన్టీఆర్‌ మండల వ్యవస్థతో పోలుస్తున్నారు.జిల్లాల పరమార్థం అభివృద్ధి వికేంద్రీకరణే.జిల్లా యూనిట్‌గా కేంద్రంనుంచి రావాల్సిన నిధులు పెరిగి, అవి నూతన అభివృద్ధి కేంద్రాలుగా రాణిస్తాయి.కొత్త జిల్లాలతో ప్రజలకు దూరాభారాలు, వ్యయప్రయాసలు తగ్గి త్వరితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రజలకు ప్రయాణ చార్జీలు తగ్గుతాయి. జిల్లాల సంఖ్య పెరుగుదలతో ఉద్యోగుల సంఖ్య పెంచవలసి వస్తుంది.అది ఉపాధి అవకాశాలు పెంచుతుంది.
తెలంగాణలో జిల్లాలు

వరుస సంఖ్య
జిల్లా
వైశాల్యం
జనాభా
మండలాలు
రెవిన్యూ డివిజన్లు
పార్లమెంటు స్థానాలు
అసెంబ్లీ స్థానాలు


1
అదిలాబాదు
4,153
708,972
18
2
2
7

2
భద్రాద్రి కొత్తగూడెం
7,483
1,069,261
23
2



3
హైదరాబాదు
217
3,943,323
16
2
2
14

4
జగిత్యాల
2,419
985,417
18
2



5
జనగామ
2,188
566,376
13
2



6
జయశంకర్ భూపాలపల్లి
6,175
711,434
20
2



7
జోగులాంబ గద్వాల
2,928
609,990
12
1

2

8
కామారెడ్డి
3,652
972,625
22
2

7

9
కరీంనగర్
2,128
1,005,711
16
2
1
7

10
ఖమ్మం
4,361
1,401,639
21
2
1
7

11
కొమరం భీమ్ ఆసిఫాబాద్
4,878
515,812
15
2



12
మహబూబాబాద్
2,877
774,549
16
2
1
7

13
మహబూబ్ నగర్
5,285
1,486,777
26
2
1
7

14
మంచిర్యాల
4,016
807,037
18
2

7

15
మెదక్
2,786
767,428
20
3
1
7

16
మేడ్చల్- మల్కాజిగిరి
1,084
2,440,073
14
2
1
7

17
నాగర్ కర్నూలు
6,545
893,308
22
3
1
7

18
నారాయణపేట


11
1



19
ములుగు
3,881
294,671
9
1



20
నల్గొండ
7,122
1,618,416
31
3
1
6

21
నిర్మల్
3,845
709,418
19
2



22
నిజామాబాద్
4,288
1,571,022
27
 3
1
7

23
పెద్దపల్లి
2,236
795,332
14
 2
1


24
రాజన్న సిరిసిల్ల
2,019
552,037
13
 1



25
రంగారెడ్డి
5,031
2,446,265
27
 5



26
సంగారెడ్డి
4,403
1,527,628
26
 3



27
సిద్దిపేట
3,632
1,012,065
22
 3



28
సూర్యాపేట
3,607
1,099,560
23
2



29
వికారాబాద్
3,386
927,140
18
 2
1
7

30
వనపర్తి
2,152
577,758
14
 1



31
వరంగల్ రూరల్
2,175
718,537
15
 2

7

32
వరంగల్ అర్బన్
1,309
1,080,858
11
 1
1


33
యాదగిరి భువనగిరి
3,092
739,448
16
 2
1
8

మొత్తం
-
112,077
35,003,674
584
64
17
121


ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 63 ఏళ్ళ కాలం లో కేవలం రెండే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), విజయనగరం (1979) జిల్లాలు.కొత్త జిల్లాల ఏర్పాటు సమస్య మన రాష్ట్రం లో అలా నానుతూనే ఉంది.ప్రజల చేరువకు ప్రభుత్వం అంటూ కబుర్లు తప్ప కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువచేయలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాటినుండీ అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదు. జాతీయ స్ధాయిలో జిల్లాల సగటు వైశాల్యం ఈనాడు 4534  చ.కి.మీ.లకు తగ్గిపోగా ఆంధ్ర ప్రదేశ్  12323  చ.కి.మీ. తో దేశంలోనే మొదటి స్ధానంలో ఉంది.
పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొనివెళ్ళాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు గారు రాష్ట్రంలోని 315 తాలూకాలను విడగొట్టి, వాటి స్థానంలో 1110 మండలాలను 1985 మే 25న ఏర్పాటు చేశారు.మండలాల మాదిరిగానే కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయమని కోరగా మండల వ్యవస్థ కుదురుకోగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ద్రుష్టి సారిస్తామని సచివాలయం నుండి నాకు 21.9.1988న జవాబు ఇచ్చారు.
మనరాష్ట్రంలో ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు సగటున 20 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ 38 లక్షల మంది అవసరాలను ఆలకిస్తున్నాడు.దేశంలో సగటున 18 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. అరుణాచలప్రదేశ్ లో అయితే 86 వేల మంది జనాభాకే ఒక జిల్లా ఉంది. మన రాష్ట్రం లో మాత్రం 38 లక్షల మందికొక జిల్లా ఉంది. అలాగే త్రిపుర  లో 1311 చ.కి.మీ.లకు ఒక జిల్లా కలక్టర్ ఉంటే మన రాష్ట్రం లో 12323 చ.కి.మీ ల భూబాగానికి ఒక కలక్టర్ ఉన్నాడు.పనులకోసం వచ్చే ప్రజలకు అత్యంత దూరం భారం కలిగించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ దేశం లో మొదటి స్ధానంలో ఉంది.
మన అనంతపురం జిల్లా వైశాల్యం 19130 చ.కి.మీ. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకంటే మన అనంతపురం జిల్లా పెద్దది. అంతేకాదు మన అనంతపురం జిల్లా  మాల్ధీవులు, మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రెయిన్, బ్రూనే, కేప్ వర్ధీ, స్రై ప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్, పోర్టోరికో, కటార్, సీషెల్స్, సింగపూర్, స్వాజీలాండ్, టోoగో, ట్రినిడాడ్ మరియు టుబాగో, వనౌటూ లాంటి దేశాలకంటే పెద్దది.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడింది.తెలంగాణాలో జిల్లాల సంఖ్య పెరిగినప్పటి నుండి ఆంధ్రాలో ప్రజలు మనకెప్పుడు అనే ప్రశ్న అడుగుతున్నారు. ముఖ్యంగా చారిత్రక ప్రాధాన్యత గల విజయవాడ, తిరుపతి,రాజమండ్రిలాంటి పట్టణాలు జిల్లా కేంద్రాలు అవుతాయని  పరిసరాల ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు.కోస్తా ఆంధ్రలో కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన అంచులో ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవులైన బందరు,కాకినాడ , విశాఖపట్నం లను జిల్లా కేంద్రాలుగా చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది.ఇలాంటి జిల్లాల కే౦ద్రాలను ఆయా జిల్లాల మధ్య ప్రాంతాలకూ మార్చలేదు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్లమెంటు నియోజకవర్గాలన్నిటినీ 25 జిల్లాలుగా మార్చాలని ఎంతోకాలంనుండి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది.
కొత్త జిల్లాలను కోరిన ప్రముఖులు : 
ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డి(నాగార్జున జిల్లా) , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ (గురజాల జిల్లా) ,గుంటూరు ఎం.పి రాయపాటి సాంబశివరావు (నల్లమల జిల్లా) , ఎన్ జీ రంగా, వసంత నాగేశ్వరరావు ,కత్తి పద్మారావు (విజయవాడ జిల్లా ),రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త  ( నంద్యాల జిల్లా) చిత్తూరు కాంగ్రెస్ నాయకుడు డి.రాంభూపాల్‌ రెడ్డి (తిరుపతి బాలాజీ జిల్లా) రాజ్యసభ సభ్యుడు జెడి శీలం (నల్లమడ జిల్లా ) ,  వైసీపీ అధ్యక్షుడు జగన్ ( అల్లూరి సీతారామరాజు గిరిజన మన్యం జిల్లా) ,
తెలుగులో పాలనకు దోహదం
ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగులో పాలనకు కూడా చిన్న జిల్లాలు బాగా దోహద పడతాయి.ఎందుకంటే స్థానికులు ఎక్కడికక్కడ తమ భాషలోనే పాలన జరగాలని నిలదీస్తారు.కలక్టర్లందరూ తెలుగు నేర్చుకొని జవాబులివ్వాల్సి వస్తుంది.చిన్న జిల్లాలలో స్థానికులకు స్థానబలం పెరుగుతుంది.తమ విన్నపాలకు జవాబులు తమకు అర్ధమయ్యే విధంగా తమభాషలోనే జవాబులు ఇవ్వమని అధికారులను అడిగి మరీ సాధించుకుంటారు.ఉర్దూ కూడా కొంతమేర బాగుపడుతుంది.
గ్రేటర్ హైదరాబాద్‌ పెద్ద గుణపాఠం  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగింది. ప్రభుత్వాలన్నీ హైదరాబాద్‌పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాయి. ఐటీ రంగం, పరిశ్రమలు ఇలా అన్నీ భాగ్యనగరం, పరిసర ప్రాంతాల్లోనే కాలువలు కూడా ఆక్రమించి కట్టేశారు. ఫలితంగా వానాకాలంలో రోడ్లే కాలువలయ్యాయి.  ఉద్యోగమైనా.. వ్యాపారమైనా.. అన్నిటికీ  అందరికీ హైదరాబాదే దిక్కు.
సీఎం చంద్రబాబునాయుడు భావన
ఈ కష్టాలు గ్రహించిన సీఎం చంద్రబాబునాయుడు ‘‘హైదరాబాద్‌ విషయంలో పొరపాటు జరిగింది. డిఫెన్స్‌, ఫార్మా, ఐటీ, విద్య, వైద్యం ఇలా కీలక రంగాలన్నీ అక్కడే రావడంతో ఉమ్మడి ఏపీలో మిగతా ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అలాంటి తప్పు నవ్యాంధ్రలో జరగకూడదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’’అన్నారట.  
ఒక్క రాజధాని నగరాన్ని మాత్రమే బాగా అభివృద్ధి చేసి, అక్కడే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృతంగా సృష్టించి, ప్రజలందరినీ అక్కడికే ఆకర్షించే  కేంద్రీకృత విపరీత పారిశ్రామికీకరణ వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌, వనరుల కొరతతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయి.కొత్తజిల్లాల స్థాపన వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమవుతుంది.జిల్లా కేంద్రాలను , విద్యా సంస్థలను, పారిశ్రామిక యూనిట్లను, వ్యాపార సంస్థలను వేర్వేరు పట్టణాలకు కేటాయించాలి. జిల్లా కేంద్రాల ప్రాంతాల్లో ఊహించని ఆర్థికాభివృద్ధికి  పునాదులు పడతాయి. అభివృద్ధి ఇప్పుడు జిల్లా కేంద్రాల వెంట పరుగులు తీస్తోంది.
రాష్ట్రంలో 3 కోట్ల జనాభా ఉన్న సమయంలో ఏర్పడిన జిల్లాలే తప్ప ఇంత వరకూ కొత్త జిల్లాలంటూ లేవు.ప్రస్తుత జనాభా 5 కోట్లకు చేరిన నేపథ్యంలో,పరిపాలనా సౌలభ్యం కోసం మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పడాలి.ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని వైసీపీ నాయకుడు జగన్ కూడా ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా  పరిపాలన వేగవంతంగా జరుగుతుంది.  ప్రతి చిన్న అంశానికి రాజధానికి వెళ్లనక్కర లేకుండా మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం తమకు దగ్గరగా ఉందనే భావన పెరుగుతుంది.ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక జిల్లా వల్ల జిల్లాలలో వాణిజ్యం పెరగడంతో పాటు, భూముల విలువ పెరుగుతాయి,దానివల్ల ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతుంది. రాజకీయంగా ఎక్కువ మంది స్థానిక నాయకులకు అవకాశం ఇచ్చినట్టవుతుంది.మంత్రి పదవులతో పాటు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఇంకా జిల్లా స్థాయిలో పదవులు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
వరుస సంఖ్య
జిల్లా
రెవిన్యూ డివిజన్లు
మండలాలు
జనాభా
వైశాల్యం
పార్లమెంటు స్థానాలు
అసెంబ్లీ స్థానాలు
1
అనంతపురం
5
63
4,083,315
19,130
2
14
2
చిత్తూరు
3
66
4,170,468
15,152
2
14
3
తూర్పు గోదావరి
7
64
5,151,549
10,807
3
19
4
గుంటూరు
4
57
4,889,230
11,391
3
17
5
కడప
3
50
2,884,524
15,359
1
10
6
కృష్ణా
4
50
4,529,009
8,727
2
16
7
కర్నూలు
3
54
4,046,601
17,658
2
14
8
నెల్లూరు
5
56
2,966,082
13,076
1
10
9
ప్రకాశం
3
56
3,392,764
17,626
1
12
10
శ్రీకాకుళం
3
37
2,699,471
5,837
1
10
11
విశాఖపట్నం
4
46
4,288,113
11,161
2
15
12
విజయనగరం
2
34
2,342,868
6,539
3
9
13
పశ్చిమ గోదావరి
4
46
3,934,782
7,742
2
15

మొత్తం
50
679
49,378,776
160,205
25
175

జిల్లా కేంద్రాలుగా మారవలసిన 12 పార్లమెంటు నియోజకవర్గాలు :
1
అరకు 2 బాపట్ల3 అనకాపల్లి 4 అమలాపురం 5 హిందూపురం 6 నంద్యాల 7 నరసాపురం 8 నరసరావుపేట9రాజమండ్రి 10 రాజంపేట 11 తిరుపతి 12 విజయవాడ.
కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసే పనే.దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర కేబినెట్‌ మాత్రమే.రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ వేర్వేరు ప్రాంతాల ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం పట్టుబడుతున్నప్పటికీ ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు కాలేదు . కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన పక్షంలో పాలనా భవనాలు లాంటి మౌలిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్కసారి చేసే పెట్టుబడి మాత్రమే. కానీ దీనివల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పొందే శాశ్వత ప్రయోజనాలు చాలా ఉంటాయి. చిన్న జిల్లాలు పరిపాలనను సులభ సాధ్యం చేస్తాయి.
 ప్రజలకు దూరం భారం తగ్గుతాయి
మనది తీరప్రాంత రాష్ట్రం. తరచుగా తుఫాను తాకిడికి, వరదలకు గురయ్యే కోస్తా ప్రాంతం లో చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల సహాయ కార్యక్రమాలు చురుకుగా అమలు జరుగుతాయి. నదులు, కాలువలు, వాగులు దాటి జిల్లా కేoద్రాలకు చేరుకోవలసిన పల్లె ప్రజలకు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల దూరం భారం తగ్గుతాయి. జిల్లా కేoద్రాలు గ్రామాలకు దూరంగా ఏదో ఒక మూలన ఉండటం వల్ల ప్రజలు చాలా యాతన పడుతున్నారు. ''రాష్ట్రంలో కొన్ని జిల్లాలను చూసినప్పుడు అవి దేశంలో కొన్ని రాష్ట్రాల కన్నా పెద్దవిగా ఉన్నాయి. ఇది పాలనాపరమైన అనేక సమస్యలకు దారి తీస్తోంది. బ్రిటీష్ పాలకులు కొన్ని జిల్లా కేంద్రాలను సముద్ర తీరంలో ఒక అంచున ఏర్పాటు చేశారు.వాటిని ఇంతవరకు ఆయా జిల్లాల నడిమధ్యకు కూడా తేలేదు.కలక్టర్ ను కలిసి రావటానికి ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని ఆ జిల్లాల ప్రజలు బాధపడుతున్నారు.
అందరికీ భవనాలు – సరిపడినంత పని
చిన్న జిల్లాల ఏర్పాటు తప్పనిసరి అవసరం. ప్రభుత్వం ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు కానీ రేపైనా వాటిని ఏర్పాటు చేయక తప్పదు! అధికార వికేoద్రీకరణ అనేది ఒక అందమైన నినాదంగా మిగిలిపోయింది. అధికారం అంతా ఒక్కచోటే ఉండకూడదు. అన్ని జిల్లాలకూ పలచగా పంచాలి . భూమి శిస్తు కమిషనర్ కు కలెక్టర్లకు మధ్య ప్రాంతీయ అధికారులు ఉండాలి.డిప్యూటీ కలెక్టర్లకు అధికారాలు పెంచాలి  ప్రతిజోన్ లోను ల్యాండ్ రెవిన్యూ జోనల్ కమీషనర్లు ఉండాలి.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జిల్లాలు,రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలి. ప్రజలకు అధికారుల్ని చేరువచేయాలి.
గ్రామ సర్పంచ్ లకు మండలాద్యక్షులకూ ఆఫీసు భవనాలు ఉన్నాయి గానీ కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ హోదా కలిగిన ఎంపీలకూ,కలక్టర్ స్థాయి జీతంవచ్చే ఎమ్మెల్యేలకు సొంత ఆఫీసు భవనాలు లేవు.జిల్లా పరిషత్ చైర్మన్ – సీఈఓ , మండలాక్షుడు – ఎంపీడీఓ ఒకే భవనం లో కూర్చుంటున్నారు.అలాగే ప్రతి ఎంపీకి ఒక కలెక్టరు,ప్రతి ఎమ్మెల్యేకి ఒక డిప్యూటీ కలెక్టర్ ను అనుసంధానం చేసి ఆయా భవనాలలో కూర్చోబెడితే మన రాష్ట్రంలోజిల్లాలు 13 నుండి 25 కు,డివిజన్లు 50 నుండి 125 కు పెరిగి ప్రజలకు పాలన మరింత దగ్గరౌతుంది.ఆమేరకు శాశ్వతభవనాలూ,మౌలికఆస్తులూ,సౌకర్యాలు ఎక్కువ ప్రాంతాలకు వికేంద్రీకరించబడతాయి.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలోనూ ఒక భారీ పరిశ్రమ ఏర్పడి స్థానికులకు ఉపాధి దొరుకుతుంది.రాష్ట్రంలో ఇప్పుడు 246 మంది డిప్యూటీ కలక్టర్లు,33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్లు మొత్తం 279 మంది ఉన్నారు.అయితే ఇంతమందిలో 50 ఆర్.డి.వో.లు,50 డి.ఆర్.వో.లు,50 అడిషనల్ జాయింట్ కలక్టర్లు (మొత్తం 150 మంది) తప్ప మిగిలిన 129 మంది స్పెషల్ పోస్టుల్లో ఉంటున్నారు.వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఏ అధికారీ ఖాళీగా ఉండనక్కరలేదు.స్పెషల్ పోస్టుల అవసరం ఉండదు.అందరికీ సరిపడినంత పని ఉంటుంది.  

సులభపాలనకు చిన్న జిల్లాలు;
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, చిన్న జిల్లాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. మారుమూల గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి బస్సులో వెళ్ళి అదే రోజు ఇంటికి చేరుకోలేనంత పెద్ద జిల్లాలున్నాయి.పెద్ద జిల్లాలలో పనుల వత్తిడి ఎక్కువై జాప్యం జరుగుతోంది.ప్రజలకు దూరం భారం ఎక్కువయ్యాయి.చాలా సమయం ప్రయాణాలకే వెచ్చించాల్సి వస్తోంది. ప్రతి పనికీ దూరంగా ఉన్న రాజధానికి  పరిగెత్తుకు రావలసిన అవసరమూ తప్పుతుంది. తాలూకాలను మండలాలుగా విడగొట్టినందువలన ప్రజలకు పాలనా యంత్రాంగం దగ్గరయ్యింది.ఇప్పుడు మండలాలు తీసేసి మళ్ళీ తాలూకాలనే పెట్టమని ఎవరూ అడగరు. చిన్న జిల్లాల ఏర్పాటు వలన అధికారులందరికీ పని సమానంగా పంచబడుతుంది.తీవ్ర పని భారం తగ్గి ప్రజలకు పనులు త్వరగా జరుగుతాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు అన్ని పార్టీలు చొరవ తీసుకోవాలి. జిల్లాల విభజన శాస్త్రీయంగా ఎంపీ నియోజకవర్గాలతో సమానంగా జరిగితే వాటి మధ్య అసమానతలు అంతమౌతాయి.రెంటికీ ఏకరూపత,సారూప్యత,అధికార పరిధుల్లో స్పష్టత సిద్దిస్తుంది.అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సమంగా జరుగుతుంది.పెద్ద తాలూకాలు చిన్న మండలాలుగా మారినట్లే పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలుగా మారడం ఒక చారిత్రక ప్రజా అవసరం.
                                                                                             --- నూర్ బాషా రహంతుల్లా
                                                                                             స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
                                                                                              అమరావతి 6301493266