ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2013, ఆదివారం

నగరాలొద్దు-చిన్న పట్టణాలే హద్దు!



నగరాలొద్దు-చిన్న పట్టణాలే హద్దు!
నూర్ బాషా రహంతుల్లా 9948878833 
రాష్ట్రం విడిపోవాలని కలిసుండాలనీ ఒకపక్క ఆందోళనలు జరుగుతున్న దశలో కూడా ఏ  మాత్రం అదురూ బెదురు లేకుండా 3 లక్షలకోట్లతో 50 వేల ఎకరాలలో ఐ.టి. హబ్ కూడా హైదరాబాదుకే కేటాయించారంటే ఏమనుకోవాలి? మిగతా రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలున్నారని, వారికో భవిష్యత్తు ఉందని ఏమాత్రం ఆలోచన లేకుండా అన్నిటినీ ఇంకా ఇంకా హైదరాబాద్‌లోనే  కేంద్రీకరిస్తారా? రాష్ట్ర విభజన సంక్షోభానికి అసలు మూలం కేంద్రీకరణేనని తెలియదా ?.
1961 లో మన రాష్ట్ర జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 131 ఉంటే  2011 నాటికి 309 కి పెరిగింది.అలాగే 1961 లో 40 మంది పుడుతుంటే 30 మంది చనిపోయేవారు.ఇప్పుడు 18 మంది పుడుతుంటే 8 మంది చనిపోతున్నారు.దశాబ్దానికి జననాల పెరుగుదలరేటు మాత్రం 10  శాతం యధావిదిగా ఉంది. 78 లక్షల జనాభాతో అలవిమాలని రీతిలో బలిసిపోయిన హైదరాబాద్ ఇంకా విస్తరించాలా? అభివృద్ధి కోసం వెచ్చించే నిధులన్నీ కొన్ని నగరాలలోనే పరిమితం కావాలా? ఉబ్బి పేలిపోతున్న నగరాల కంటే చిన్న చిన్న పట్టణాలు రాష్ట్రమంతటా అభివృద్ధి చేయటం మంచిది కాదా?
20 కిలో మీటర్ల వ్యాసార్థం దాటిపోయాక ఇక ఆ నగర విస్థరణను ఆపివేయటం మంచిది. ప్రతిగా మరో చోట మరో చిన్న పట్టణాన్ని అభివృద్ధి చెయ్యాలి. ప్రతి పట్టణం చుట్టూ గ్రీస్ బెల్టులు ఏర్పరచాలి. గిరిజన ప్రాంతాల్లో కూడా చిన్న పట్టణాల సంఖ్య పెరగాలి. విశాఖపట్టణం లాంటి పట్టణాల విస్తరణ ఇక ఆగిపోవాలి.విస్తరించుకోదగిన  నిజాంపట్నం లాంటి ప్రదేశాలు మనకెన్నో ఉన్నాయి.వాటిని వాన్ పిక్ లాంటి సంస్థలు తన్నుకుపోతున్నాయి.
అభివృద్ధి అంతా నగరాలలోనే కేంద్రీకృతమవుతున్నందు వల్ల గ్రామీణుల వలసలు ఆగడం లేదు. వృత్తి కోసం, ఉపాధి కోసం, వైద్యం కోసం, విద్య కోసం, వస్తువుల కొనుగోలు కోసం నిరంతరం గ్రామాల నుండి ప్రజల ప్రయాణం నగరాలకు పట్టణాలకు జరుగుతోంది. పల్లెల్లో పేదలు అక్కడ నిలవలేకపోయాతున్నారు. ఓ వైపు పల్లెటూళ్ళలో స్తబ్దత, మరోవైపు శరవేగంతో నగరీకరణ జరుగుతోంది. ఈ అసమానతల వల్ల, నగరాల్లో ప్రతిరంగంలోను స్పెషలిస్టుల దోపిడీ నిరాఘాటంగా కొనసాగుతోంది. గ్రామాల్లో పేదలకు పని దొరక్క అలమటించిపోతున్నారు. ఎక్కడ పని దొరికితే అక్కడికి మూటా ముల్లె సర్దుకుని వలసపోతున్నారు. ఏటేటా వలస వచ్చే జనంతో నగరాలు మురికివాడలతో ఉబ్బిపోతున్నాయి. కాలుష్యం, రద్దీ పెరిగిపోతున్నది.దీపావళి రోజున నిత్యం రద్దీగా ఉండే  ఎర్రంమంజిల్లో ఒక గుడిసె తగలబడి  మహిళ సజీవ  దహనమై పోతే కాపాడే దిక్కులేదు. పెద్ద పట్టణాలలో ఎవరికెవరో పట్టించుకోరు, సహాయపడలేరు.
  గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచితే పట్టణాలకు వలస తగ్గుతుంది. మండలాల స్థాపన ద్వారా అధికార పీఠాలు వికేంద్రీకరించబడ్డాయి. అలాగే జిల్లాలు, రెవిన్యూ  డివిజన్లు పెంచటం ద్వారా ప్రాంతీయ సెక్రెటేరియట్ లు నెలకొల్పటం ద్వారా యావత్తు రాష్ట్రానికీ మేలు జరుగుతుంది.
తరగతుల వారీ మన రాష్ట్రంలో పట్టణాల సంఖ్య
సంవత్సరం
I
II
III
IV
IV
V
మొత్తం
లక్షపైబడిన లక్షలోపు 50 వేల లోపు 20 వేల లోపు 10 వేల లోపు 5 వేల లోపు
జనాభా 50 వేల పైన 20 వేల పైన 10 వేల పైన 5 వేల పైన
1901
1
-
11
44
60
-
116
1911
1
1
12
45
68
3
130
1921
1
2
13
45
74
14
149
1931
1
8
11
57
78
20
175
1941
1
10
21
55
122
2
211
1951
6
10
34
81
114
31
276
1961
11
8
50
71
70
1
211
1971
13
17
60
75
37
4
206
1981
20
30
87
65
28
4
234
1991
32
34
91
39
14
3
213
2001
39
43
46
23
20
2
173
2011
46





353 
లక్ష జనాభా దాటిన పట్టణాలను క్లాస్ 1 అంటారు. ఇవి 1901 లో ఒక్కటే ఉంటే ఇప్పుడు 46 కి పెరిగాయి.రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు క్లాస్ 1 క్లాస్ 2 పట్టణాల్లోనే నివసిస్తున్నారు. 5000 లోపు జనాభా ఉన్న గ్రామాలు క్రమేణా అంతరిస్తుంటే పెద్ద గ్రామాలు పట్టణాలుగా మారిపోతున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 28123 గ్రామాలుంటే 2011 నాటికి గ్రామాల సంఖ్య 27800 కు తగ్గిపోయింది.అందులో 1779 గ్రామాల్లో అసలు జనం నివసించడం లేదు. అంటే ఈ 1799 గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాలు లేనందువల్ల ప్రజలు ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారన్న మాట! మరో ప్రక్క పట్టణాలలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. నగరాలు నరక కూపాలవుతున్నాయి.ఇప్పుడు 19 కార్పోరేషన్లు,157 మునిసిపాలిటీలు రకరకాల సమస్యలను ప్రజలకు రుచిచూపిస్తున్నాయి.క్లాస్ 1 నగరాల పెరుగుదలకు కనైనా బ్రేకులు వేసి క్లాస్ 3,4,5 ల అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి సారించాలి.
రాష్ట్రంలో లక్ష జనాభా దాటిన నగరాలు, పట్టణాలు


2001 జనాభా
2011 జనాభా


వేలలో
వేలలో
1
హైదరాబాద్ (కా)
5534
7749
2
విశాఖపట్టణం (కా)
1330
1730
3
విజయవాడ (కా)
1011
1491
4
వరంగల్లు (కా)
577
760
5
నెల్లూరు (కా)
405
734
6
గుంటూరు (కా)
515
674
7
రాజమండ్రి (కా)
408
478
8
కర్నూలు (కా)
321
478
9
తిరుపతి (కా)
303
460
10
కాకినాడ (కా)
369
443
11
కడప (కా)
261
344
12
అనంతపురం (కా)
244
342
13
నిజామాబాదు (కా)
287
310
14
కరీంనగర్ (కా)
216
300
15
ఏలూరు (కా)
215
286
16
ఆదోని
161
271
17
ఖమ్మం
197
266
18
రామగుండం
237
253
19
విజయనగరం
196
239
20
ప్రొద్దుటూరు
165
218
21
నంద్యాల
156
212
22
మహబూబ్ నగర్
139
210
23
ఒంగోలు
153
206
24
మదనపల్లి
107
179
25
చిత్తూరు
153
176
26
మచిలీపట్నం
183
170
27
తెనాలి
150
166
28
మంచిర్యాల
118
164
29
చీరాల
167
163
30
నల్గొండ
112
154
31
హిందూపూర్
125
152
32
భీమవరం
142
147
33
శ్రీకాకుళం
117
147
34
ఆదిలాబాద్
129
139
35
గుంతకల్లు
117
126
36
ధర్మవరం
103
122
37
కొత్తగూడెం
105
119
38
గుడివాడ
112
118
39
నరసరావుపేట
97
118
40
సిద్ధిపేట
62
114
41
కావలి
84
109
42
తాడిపత్రి
87
108
43
సూర్యాపేట
95
107
44
మిర్యాలగూడ
91
105
45
తాడేపల్లిగూడెం
102
104
46
జగిత్యాల
89
104
47
చిలకలూరిపేట
90
102


1952 లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును గుంటూరులో పెట్టారు. పౌర ప్రాధాన్యత గల పీఠాలన్నీ ఒకే నగరంలో తిష్టవేయకుండా అన్ని ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందాలన్న దూరదృష్టితో ఆనాటి పెద్దలు అలా చేశారు. మరి ఈనాడు అన్నిటికీ హైదరాబాదే దిక్కు. హైదరాబాదు ను గ్రేటర్ గా మహా గ్రేటర్ గా విస్తరించుకుంటూ పోతున్నారు.
 నగరం ఉబ్బిపోక ఏం చేస్తుంది? ఓపెన్ యూనివర్సిటీ కి నాగార్జున సాగర్ లో శంకుస్థాపన చేస్తే దాన్నీ హైదరాబాద్ కే తరలించారు.  దక్షిణ కోస్తా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  ఆఫీసును కూడా మొన్న హైదరాబాదుకే తరలించారు. హైదరాబాద్ నుండి ఇలాంటి పీఠాలన్ని రాష్ట్రంలోని ఆరు జోనులకు తిరిగి రావాలి. ఆరు జోనులూ సమానంగా అభివృద్ధి చెందాలి.          
హైదరాబాదు చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా విపరీతంగా జనాన్ని ఆకర్షిస్తున్నది. పారిశ్రామిక, పరిపాలనా కేంద్రీకరణతో ఈ రెండు జిల్లాలు కలసిపోయి 7710 చ.కి.మీ. వైశాల్యంతో మెగాసిటీ గా రూపొంది చదరపు మీటరుకు వెయ్యిమంది జనం కిటకిటలాడుతున్నారు. అయితే ఈనాడు మనకు కావలసింది మెగా సిటీలు కాదు. సౌకర్యవంతమైన చిన్న పట్టణాలు.గ్రామాలు ఏ సౌకర్యానికీ నోచుకోక దేశ దారిద్ర్యాన్ని ప్రతిబింబిస్తుంటే, పట్టణాలు మహానగరాలుగా మారి నరకకూపాలను తలపింపజేస్తున్నాయి. పల్లెల్లో ఉపాధి దొరకటం లేదు. నగరాల్లో ఉపాధి దొరికినా సుఖంగా బ్రతికేందుకు ఆదాయం సరిపోవటం లేదు. 50 వేల జనాభా దాటిన పట్టణాలన్నింటిలో ఎన్నో కొరతలు కనిపిస్తాయి. నిధుల కొరత, నిర్లిప్తత, వైఫల్యాలు, పథకాల్ని దెబ్బతీస్తున్నాయి. ఈ వాస్తవం గుర్తించి తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సంక్షేమ కార్యక్రమాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసే బదులు సొంత కాళ్లమీద నిలబడేలా ప్రతి వ్యక్తికీ చేయూతనివ్వాలి. తక్షణం ఉపాధి కల్పించే  పారిశ్రామిక, సేవారంగాలను ప్రోత్సహించాలి.మన దేశపు దొంగలు విదేశాల్లో దాచుకున్న 25 లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని తిరిగి రాబట్టగలిగితే అందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వొచ్చనీ ప్రతి పల్లెల్లోనూ పట్టణాల్లోనూ  మంచి మంచి రోడ్లు నిర్మించి  పరిశుభ్రంగా చెయ్యొచ్చనీ ఆర్ధిక వేత్తలు లెక్కగట్టారు.సుప్రీం కోర్టూ ఆ డబ్బు రాబట్టమనే చెప్పింది . కానీ దేశద్రోహులు విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బును తిరిగి తేగల ధీరుడెవ్వడు? పబ్లిక్ ప్రైవేట్ పార్టీసి పేషన్ (పిపిపి) పద్ధతిలో నల్లధనం రాజమార్గంలో  పేరుకుపోతూనే ఉంది. ప్రభుత్వం అనుసరిస్తున్న పంథా పేదరికాన్ని కాకుండా, పేదల సంఖ్యను తగ్గించి చూపడం. తద్వారా పేదరికాన్ని తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చుగానీ మురికి వాడలలో నివశిస్తున్న కోట్లాది ప్రజల సమస్యలు నిజంగా తీరవు. కాబట్టి క్రింది ప్రాథమిక సదుపాయాలు కల్పించాలి.
అందరిమేలుకు ఆరుసూత్రాలు :
        1. పార్లమెంటు నియోజక వర్గాన్నీ జిల్లాను ఒకే పరిధిలోకి తేవాలి. ఒక పార్లమెంటు సభ్యునికి ఒక జిల్లా కలెక్టర్ ఉండాలి.జిల్లాల సంఖ్య 42 కు రెవిన్యూ డివిజన్ల సంఖ్యను 294 కు పెంచాలి.  సివిల్ సప్లైస్,ఎలక్షన్స్,సెన్సస్,నాచురల్ కలామిటీస్,..లాంటిపనులకు ప్రత్యేక శాఖలు ఏర్పాటు చెయ్యాలి. జిల్లా స్థాయిలోనే నిర్ణయాలు జరగాలి. అన్ని పనులు ప్రజలు ఎన్నుకున్న జిల్లా పరిషత్ ఆద్వర్యం లో జరగాలి.రెవిన్యూవాళ్ళతోపాటు ఇతరశాఖల అధికారుల్ని కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా నియమించాలి. జిల్లా రెవిన్యూ అధికారిని కలక్టర్ నుండి విడదీసి అన్నిశాఖల జిల్లా అధికారులలాగానే విడిగా ఉంచి తనశాఖ పని (ఆర్.వో.ఆర్.భూమి రికార్డులు..వగైరా ) తనను చేసుకోనివ్వాలి.ఎవరి పని ఏమిటి అని స్పష్టంగా నిర్దేశించి బాధ్యులను చెయ్యాలి.
     2. అన్ని జిల్లా కేంద్రాలకు,రెవిన్యూ డివిజన్ కేంద్రాలకూ ప్రజలు రైలులో వెళ్ళే భాగ్యం కల్పించాలి. ప్రతి ఎక్స్ ప్రెస్ రైలు అది ఎంత పెద్దదయినా సరే జిల్లా కేంద్రాల్లో ఆగే ఏర్పాటు చేయాలి.

3.    50 వేల జనాభా దాటిన పట్టణాలకు బయట రింగు రోడ్లు వేయించాలి. కనీసం ఒక ఫర్లాంగు వెడల్పున ఈ రింగురోడ్ల వెంబడే పచ్చని చెట్లను పెంచాలి.ఇవి గ్రీన్ బెల్టు గానూ పార్కులు గానూ ఉపయోగపడతాయి.పట్టణ ప్రజలకు ప్రాణవాయువునిస్తాయి.
4.    మండల కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. 2 లక్షల జనాభా దాటిన పట్టణాల దగ్గరలో ఇక మీదట కొత్తగా ఏ పరిశ్రమనూ పెట్టనివ్వకపోతేనే పరిశ్రమలు మండలాల బాట పడతాయి. మండల కేంద్రాల్లో వృత్తి శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలి. కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీల స్థాపన ఆపివేసి వృత్తి విద్యా కళాశాలలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు కళాశాలలు మాత్రమే నెలకొల్పాలి.
5.     పల్లెల్లో పక్కా ఇళ్ళ నిర్మాణం భారీగా చేపట్టాలి. పట్టణాలలో క్వార్టర్ల నిర్మాణం అవసరాలకు అనుగుణంగా చేపట్టి రిటైరైన ఉద్యోగులకు వారి వారి మండల కేంద్రాల్లో ఇళ్ళు కట్టించి నగరం నుండి పంపివేయాలి.అంతర్జాతీయ విమానాశ్రయాలతో విదేశాల్లో మన ఖ్యాతి పెరగవచ్చు కానీ, మన పట్టణాలన్నీ సరైన బస్సు డిపోలకూ, రైలు స్టేషన్లకూ, రింగు రోడ్లకు, పుష్కలమైన మంచినీటికి నోచుకుంటేనే ఈ ఖ్యాతికి సార్థకత చేకూరుతుంది.ఎక్కువమంది ప్రజలు ,రోడ్లు, డ్రైనేజీ, బస్సుల రాకపోకలు వంటి మౌలిక సౌకర్యాలు లేనందువల్ల అక్కడకు వెళ్లిస్థిరపడలేకపోతున్నామనికంపెనీలు  వాదిస్తుంటాయి.అనంతపురం,కాకినాడ లాంటి  నగరాలకు సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సంస్థలు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవని చెబుతాయి.అందుకే  ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలుముందుగాకల్పించాలి.
6. 41ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌) లో పన్ను రాయితీలు న్నాయి.హైదరాబాద్‌ పరిసరాల్లో 29 ,విశాఖలో 4 , వరంగల్‌లో 2 , కృష్ణా, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్క సెజ్‌ ఉన్నాయి.ఆయా ప్రాంతాల్లో మెరుగైన ఉపాధికి అవకాశాలు లేకనే విద్యార్థులు మహా నగరాలకు వలస పోతున్నారు. జిల్లాకో భారీ పరిశ్రమ రూపు దిద్దుకొనే వరకు భాగ్యనగరానికి ఏ పరిశ్రమనూ ప్రకటించ గూడదు".1956 నుండి జిల్లాల ప్రజల మొర ఇదే.పాలకులు వినలేదు. పెద్దరాష్ట్రం అలాగే ఉండాలనుకున్నపెద్దలు అభివృద్ధి కేంద్రాలన్నీ రాజధాని నగరంలోనే కుప్పపోయకూడదు.ఇరవైమూడు జిల్లాలకూ సమంగా పంచాలి. రెవిన్యూడివిజన్ స్థాయికి ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్,ఫార్మశీ కాలేజీలను వికేంద్రీకరించిన పాలకులు పరిశ్రమలనుమాత్రం హైదరాబాదులోనే కేంద్రీకరించారు.ఇకనైనా ఈ తప్పు దిద్దుకోవాలి.మొత్తం రాష్ట్రం లోని అన్నీ ప్రాంతాలకూ  మేలు చేయాలి.
http://www.suryaa.com/opinion/edit-page/article-158678 (సూర్య 8.11.2013)

 



https://www.facebook.com/photo.php?fbid=660275147337812&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
గీటురాయి  29.11.2013



https://www.facebook.com/photo.php?fbid=669881863043807&set=p.669881863043807&type=1&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి