ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

కృష్ణా – గోదావరి



జలగం విమర్శ సబబు కాదు
ఈనాడు 2-6-1987                                         ఎన్. రహంతుల్లా
                                                              హైదరాబాద్
              జంట నగరాల నీటి కొరతను నివారించే విషయంలో ఇంజనీర్ల కమిటీ        ఇచ్చిన నివేదిక పై ప్రజాభిప్రాయాన్ని కోరకుండా ప్రభుత్వమే ఒక        నిర్ణయానికి రావాలని శ్రీ జలగం వెంగళరావు అనటం సమంజసంగా లేదు.   1972 లో శ్రీ శ్రీనివాసరావు కమిటీ కృష్ణానది నుంచి నీటిని తరలించాలని,     మంజీరాపై కొత్త ప్రాజెక్టులు కట్టవద్దిని సలహా ఇచ్చింది. ఆ కమిటీ సలహాను   పెడచెవినిబెట్టి 1973 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వెంగళరావు మంజీరానదిపై        సింగూరు డ్యాంకు శంకుస్థాపన చేశారు. కృష్ణానది మీదే కమిటీ సలహా      ప్రకారం ఎందుకు శంకుస్థాపన చేయలేదు ? కమిటీ మాట వారు ఆనాడే విని ఉంటే ఈనాడు ఈ దుస్థితి తప్పేది కదూ! పైగా నిర్ణయాలు తీసుకోవడానికి    ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని వెంగళరావు గారు ప్రవచిస్తున్నారు.   ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అసలా నిర్ణయాలు చేస్తున్నదెవరు?   కృష్ణా జలాలను కదిల్చితే సహించేది లేదని కాంగ్రెసు వాళ్ళే ఈనాడు రెండు        ముఠాలుగా చీలి ఆ గట్టున ఒకరు, ఈగట్టున మరొకరు ఉద్యమాలకు సిద్ధమయ్యారు. మూడో గ్రూపు వారేమో, జంటనగరాలకు కృష్ణాజలాలు   తరలించాలని నగరంలో ఉద్యమిస్తున్నారు. వేరొక ఇంజనీర్లు   ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.  ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ     కర్తవ్యమేమిటో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని హోదాలో శ్రీ జలగం        వెంగళరావు గారే సెలవియ్యవచ్చుగదా!


కృష్ణా – గోదావరి అనుసంధానం
ఆంధ్రప్రభ 1-3-1990                                                 నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాదు

ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మంచినీటి సరఫరా పారిశుద్ధ్య అంతర్జాతీయ దశాబ్దం గడిచిపోయింది. మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1990 నాటికి అందరికీ మంచి నీటి సరఫరా పథకం ముగియ వస్తున్నది. కాని మన దేశంలో ఇంకా 1,61,722 గ్రామాలు, రాష్ట్రంలో 22,860 గ్రామాలు త్రాగే నీటికి నోచుకోక సమస్యాత్మకంగా మిగిలి ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. నీళ్లు దొరుకుతున్నా అవి త్రాగటానికి అర్హమైనవి కాకపోవటం, కాలుష్యంతో నిండి ఉండటం ఈనాడు పెద్ద సమస్యగా పరిణమించింది. పరిశ్రమలు వదిలే కాలుష్యం భూగర్భ జలాలలో కలిసి వస్తున్నది. నదుల నీళ్ళు కూడా పరిశ్రమల వల్ల కలుషితం అవుతున్నాయి. వేసవి కాలం వచ్చేటప్పటికి నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. వర్షాకాలంలో కురిసే నీటిని నిల్వ చేసుకోలేకపోవటం మన దురదృష్టం. నీటి యాజమాన్యం శాస్త్రీయంగా జరగటం లేదు. హైదరాబాదుకు మంచినీటి సరఫరా చేస్తూ గోదావరిని కృష్ణానదితో కలిపితే ఆ రెండు నదుల మధ్య భూమి సస్యశ్యామలం అవుతుంది.

రెండు నదుల అనుసంధానం వల్ల జలాల పరిరక్షణ జరిగి నీటి కొరత నివారణ అవుతుంది.



ప్రాజెక్టులు కట్టొచ్చుగా ?
ఆంధ్రభూమి 26-8-1990                                          ఎన్. రహంతుల్లా
ఏలూరు

పడవ తల్లక్రిందులై ప్రయాణీకులు, వరదలు వచ్చి నదీ ప్రాంతాలలోని ప్రజలు మరణిస్తున్నారు. మనకు ఉంటే ఉరవళ్ళు పరవళ్ళు తొక్కే స్థాయిలో నీళ్ళుంటాయి. లేకపోతే గుక్కెడు నీళ్ళకు కూడా కటకట ఏర్పడుతుంది. ఎండిపోయిన కృష్ణను పట్టుకుని వాదులాడే కంటే నిండు గోదావరి మీద రిజర్వాయర్లు కట్టవచ్చు గదా ? నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టు గోదావరి మీద నిర్మించవచ్చుగదా ? మన ప్రజాప్రతినిధులు కాలువల మద వంతెనల కోసం మరిన్ని రిజర్వాయర్ల కోసం ప్రయత్నించాలి.



రిజర్వాయర్లు అవసరం
జనవాక్యం 30-8-1990                                            రహంతుల్లా
కొవ్వూరు

ఉరవళ్ళు, పరవళ్ళు తొక్కుతూ, నానా భీభత్సాన్ని సృష్టించిన గోదావరి నదిని చూస్తే భయంతో గుండె దడదడలాడింది. అదే సమయంలో 'తల్లీ గోదారికే వెల్లువొస్తే అందం' అని పాట వ్రాసిన కవిమీద కోపం ముంచుకొచ్చింది. ఇన్ని మంచినీళ్ళు వృధాగా ఉప్పు సముద్రం పోలైపోతున్నాయే అని బాధ కలిగింది. గోదారి పక్కనే ఉన్న బావుల్లో ఉప్పు నీళ్ళ గతేమిటా అని నిట్టూర్చవలసివస్తోంది. మళ్ళీ ఎండాకాలం వస్తే మంచినీళ్ళకు కటకటే గదా అని బెదురు పట్టుకుంది.

గోదారి ప్రాంతం నుంచి ఎన్నికైనా ఎమ్మెల్యేలు, ఎం.పీ లు ఎక్కడున్నారో, ఏమైపొయ్యారో అర్థం కావడం లేదు. అదిలాబాద్ జిల్లా మొదలుకొని బంగాళాఖాతం వరకు ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున రిజర్వాయర్లు నిర్మిస్తే వరదలు ఆగిపోతాయి. ఎంతో భూమి సాగులోకి వస్తుంది. మంచినీటి సమస్య తీరుతుంది. నీళ్ళు వృధాగా సముద్రంలో కలువవు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనికి నిధులు కేటాయించాలి.



కాలువ రెండవ వైపు కూడా రోడ్డు వేయాలి
ఈనాడు 17-10-1992                                                        

నర్సాపురం – నిడదవోలు కాలువకు ఒక పక్క మాత్రమే రోడ్డు సౌకర్యం ఉంది. అందువల్ల కాలువ అవతలి వైపున గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో కాలువ రెండవ వైపు కూడా తారు రోడ్డు వేయిస్తే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు కాలువ గట్టు రెండూ పటిష్టమై గండ్లుపడవు. నర్సాపురం నుంచి నిడదవోలు వరకు ఉన్న దాదాపు 120 గ్రామాలకు ఈ రోడ్డు వల్ల మేలు కలుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి