ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

'పింజారి'



       'పింజారి' పద ప్రయోగం
ఆంధ్రపత్రిక 30-11-1990          నూర్ బాషా రహంతుల్లా,ఏలూరు

దేశంలో కుల మత వైషమ్యాలు పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా విద్యావంతులైన కొందరికి కనువిప్పు కలగటం లేదు. ఉదాహరణకు 22-11-1990 రాత్రి 7 గంటలకు దూరదర్శన్ లో ప్రసారమైన 'ఎండమావులు' సీరియల్ లో ఒక బ్రహ్మణ పూజారి తనను అప్పు అడిగిన వ్యక్తిని "పింజారీ వెధవ" అని తిడతాడు. పింజారి అంటే దూదేకుల కులస్తుడు. ఇలా కులం పేరుతో మరో వ్యక్తిని దూషించటం అమానుషత్వం. రేడియో, దూరదర్శన్ అధికారులు ఇలాంటి కుల దూషణ డైలాగులు రాకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే మేము కోర్టులో దావా వేయలసి వస్తుంది.



కులం పేరు వర్తించే టి.వి. చిత్ర సంభాషణలు
విశాలాంధ్ర 28-11-1990                                          

మహాశయా !
22-11-1990 రాత్రి 7 గంటలకు టి.వి. లో ప్రసారమైన సీరియల్ ఎండమావులు లో ఒక బ్రాహ్మణ పూజారి తనను అప్పు అడిగిన వ్యక్తిని పింజారీ వెధవ అని తిడతాడు. పింజారీ అంటే దూదేకుల కులస్తుడు. ఇలా కులం పేరుతో మరో వ్యక్తిని దూషించటం అనాగరిక లక్షణం. ఇలాంటి డైలాగుల్ని దూరదర్శన్ అధికారులు ఎలా అనుమతిస్తున్నారో అర్ధం కావడంలేదు.
ఈ తిట్టు పదం మరోసారి ప్రసారమైతే మేము కోర్టులో దావా వేయవలసి వస్తుందని తెలియజేస్తున్నాను.



       టీ.వీ.లో కుల దూషణ
ఉత్తరప్రభ 28-11-1990                                              

22-11-1990 రాత్రి 7 గంటలకు హైదరాబాద్ దూరదర్శన్  ప్రసారం చేసిన 'ఎండమావులు' సీరియల్ లో ఒక బ్రాహ్మణ పూజారి మరో వ్యక్తిని పింజారీ అని తిడతాడు. పింజారీ అంటే దూదేకుల కులస్తుడు. నాదస్వర విద్వాంసుడు పద్మశ్రీ షేక్ చిన మౌలానా, బుర్రకధ పితామహుడు పద్మశ్రీ షేక నాజర్, క్లారినెట్ విద్వాంసుడు శ్రీ జగ్గయ్య పేట హుస్సేన్, ప్రఖ్యాత విద్యావేత్త శ్రీ నూర్ బాషా అబ్దుల్  లాంటి వారు జన్మించిన కులం ఇది. ఈ కులంలో ఎంతో మంది హిందువుల శుభకార్యాలకు బ్యాండు మేళాలు వాయిస్తుంటారు. కులం పేరుతో మరో మనిషిని దూషించటం అనాగరిక లక్షణం. కుల వైషమ్యాలను సమసిపోయేట్లు చేయవలసిన దూరదర్శన్ ఇలా కుల దూషణకు అనుమతించటం మంచి పద్ధతి కాదు. ఈ పొరపాటు మరో సారి జరక్కుండా చూస్తారని దూరదర్శన్ అధికారులను కోరుతున్నాను. 



టీవీలో కులం తిట్లు
ఉదయం 30-11-1990                                            

కులాల కాష్టం దేశంలో రగులుతుంటే హైదరాబాద్ దూరదర్శన్ అందులో ఆజ్యం పోస్తున్నది.

నవంబర్ 22 వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రసారమైన ఎండమావులు సీరియల్ లో ఒక బ్రాహ్మణ పూజారి తనను అప్పు అడిగిన వ్యక్తిని ' పింజారీ వెధవ' అని నిందిస్తాడు. పింజారీ అంటే దూదేకుల కులస్తుడు. ఇలా కులం పేరుతో మరో వ్యక్తిని దూషించటం అనాగరికుల లక్షణం.

దూరదర్శన్ అధికారులు మరోసారి ఈ తిట్టును ప్రసారం చేస్తే మేము కోర్టులో దావా వేయాల్సివస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి