ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

అకాడెమీల పునరుద్ధరణ



సజీవ భాష – గ్రామాల్లో ఉంది
ఆంధ్రజ్యోతి 20-1-1990                                             నూర్ బాషా రహంతుల్లా
దిల్ సుక్ నగర్

          వివిధ అకాడమీలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో సర్వశ్రీ బాబా, ఖోస్లా, విశ్వనాధం, శంకరగిరి, నార్ల వెంకటేశ్వర రావుల కమిటీల నివేదికల్లో చేసిన సూచనలను ప్రభుత్వం ఒకసారి పరిశీలించాలి. అశ్రిత పక్షపాతం, అసమర్ధత, ప్రభుత్వ భజన, గ్రాంటుల దుర్వినియోగం మొదలైన విషయాలకు అకాడమీలు ఖ్యాతిగాంచాయి. తెలుగు భాషలో శాస్త్రీయమైన ప్రామాణికమైన నిఘంటువు రూపొందిస్తానని శపధం చేసిన సాహిత్య అకాడమీ ఆ పని సక్రమంగా చేయలేకపోయింది. ఇప్పటికీ బ్రౌన్ నిఘంటువే మనకు శరణ్యంగా ఉంది. ప్రామాణిక భాషా గ్రంధాలు ముందుగా వెలువరించాలి. కాల్పనిక సాహిత్యంతో డబ్బు వృధా చేయడం తగదు. హైదరాబాదు ఆఫీసు గదుల్లో కూర్చుని కళలను, భాషను నిర్వచించబూనటం అవివేకం, జనం నాలుకల మీద నాట్యమాడే సజీవ భాష గ్రామాలలో ఉంది. ప్రతి మండల కేంద్రంలో ఆరు బయలు రంగస్థలాల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి. మరుగున పడిపోతున్న మాణిక్యాలను వెలికి తేవాలి. అప్పుడే అకాడమీలు సార్ధకమవుతాయి.



అకాడెమీల పునరుద్ధరణ
ఉత్తరప్రభ 21-1-1990                                               నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాద్

రద్దు చేయబడిన వివిధ అకాడెమీలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మంచి పనే కానీ గతంలో ఆయా అకాడమీలు నిధులు దుర్వినియోగం చేసి, ఆశ్రిత పక్షపాతంతో, అత్యంత నిర్లక్ష్య స్వభావంతో కాలం గడిపాయి. అవే లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. 1957లో ప్రారంభమైన సాహిత్య అకాడమీ తెలుగులో ఒక శాస్త్రీయ ప్రామాణిక నిఘంటువు నిర్మిస్తానని చెప్పి కూడా సాదించలేకపోయింది. తెలుగు రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ళకు కూడా సి.పి.బ్రౌన్ డిక్షనరీ పైనే మనం ఆధారపడవలసి రావడం శోచనీయం. కాల్పనిక సాహిత్యం కోసం కోట్ల రూపాయలు వృధా చేసే బదులు ప్రామాణిక భాషా గ్రంధాలను తయారుచేయాలి. ప్రతి మండల కేంద్రంలో లలిత కళాతోరణం లాంటిది కట్టిస్తే గ్రామాలలోని అసలైన భాష సుసంపన్నం అవుతుంది.




వీడియో పార్లర్స్ కు అనుమతి ఇవ్వాలి
ఆంధ్రపత్రిక 3-5-1990                                              
                                                       
                   ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పధకాలకు       ప్రాముఖ్యతనిస్తోంది. హర్షించదగిన విషయం, వీడియోపార్లర్స్     డుపుకునేందుకు నిబంధనలను సడలిస్తే ఎంతోమందికి గ్రామగ్రామానా    ఉపాధి లభిస్తుంది. బడా సినీ నిర్మాతల వత్తిడికి లొంగి వీడియో పార్లర్లపై     నియంత్రణలు విధించటం అన్యాయం. వీడియో అనేది విజ్ఞాన శాస్త్రం మనకు        అందించిన మరో సౌకర్యం. పార్లర్స్ ను మూసివేయించగలిగారేగాని ధనిక    వర్గాల పడక గదుల్లో జరిగే వీడియో ప్రదర్శనలను ఆపగలిగారా? పేద        వర్గాలవారికి చౌకగా వినోదాన్ని అందించగల సాధనం వీడియో, సినిమాల   కోసం పట్టణాలకు ప్రయాణం చేసే యాతన పల్లె ప్రజలకు తప్పుతుంది.    అలాగే ఆటో రిక్షాలపై ఆర్.టి. వాళ్ళు ఆంక్షల్ని సడలించి నిరుద్యోగ        యువకులు ఆటోలు నడుపుకునేందుకు అవకాశాలు కల్పించాలి. గృహ      నిర్మాణ  కార్యక్రమాలు భారీ ఎత్తున ప్రారంభించి         నిరుద్యోగ యువకులను
       కార్మికులుగా చేర్చుకోవాలి, సౌరశక్తితో         విద్యుత్తు ఉత్పత్తి చేసే    కేంద్రాలను   విరివిగా స్థాపించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి