ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

క్రికెట్



ఈ క్రికెట్ మనకొద్దు
ఈనాడు 21-6-1999                                          ఎన్. దేవకుమార్
                                                                               పాలకొల్లు
                                                                పశ్చిమ గోదావరి జిల్లా
       'క్రికెట్ ఫర్ యూనిటీ' అనే నినాదం అబద్ధమని తేలిపోయింది. ఈ ఆటవల్ల ప్రపంచంలో ఐక్యతా భావం పెంపొందకపోగా వారి వారి దేశాల జెండాలు పట్టుకొని పిచ్చి పట్టిన వాళ్ళ లాగా ఊగిపోతున్నారు. జాతీయ పతాకాలను దహనం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఓడిపోతే ఆటగాళ్ళు వారి స్వదేశంలోకి అడుగు పెట్టడానికే భయపడి విదేశాల్లో కొంతకాలం తలదాచుకోవాల్సిన దురవస్థ దాపురిస్తోంది. ఆట బాగా ఆడినంతకాలం నీరాజనాలు పట్టి, గొప్ప దేశభక్తులుగా కీర్తించిన వారే ఓడినప్పుడు దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ అవమానిస్తున్నారు. క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనా ? జనాన్ని పిచ్చివాళ్ళుగా మారుస్తున్న  ఈ క్రికెట్ మనకొద్దు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి