ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

క్రైస్తవం -ఇస్లాం



మరో ప్రవక్త అవసరమా?
అంధ్రప్రభ 7-7-1987                                                  
              వివిధ  ప్రవక్తలు తెచ్చిన దైవ సందేశాలు శాశ్వతమైనవిగా ఆయా     కాలాలలో నమ్మబడినప్పటికీ, పూర్వ కాలాలలో సందేశాలను కొట్టివేస్తూనో,      మార్పు చేస్తూనో మరో ప్రవక్త ఉద్భవించటం జరిగింది. చివరకు కొందరు   ప్రవక్తలు తమ తరువాత ఇక ప్రవక్తలే రారని కూడా ప్రకటించడం జరిగింది.    ఉదాహరణకు యూదులు ఎజ్రా అనే ప్రవక్త తరువాత సరాసరి మెష్పయా        అనే కడపటి ప్రవక్త కోసం ఎదురుచూస్తుంటే, క్రైస్తవులు ఏసుక్రీస్తును, ముస్లిములు మహమ్మదును చివరి ప్రవక్తలుగా భావించారు. అయితే ఈ     నవీన కాలానికి ఆ చివరి ప్రవక్తలు తెచ్చిన సందేశాలు సరిపోవని, శాస్త్ర   సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన మరో ప్రవక్త రావలసిన అవసరం ఉందని చికాగోలో కొందరు మత పెద్దలు సమావేశమై అభిప్రాయపడ్డారు.        పునరుత్థాన దినం వరకు ప్రవక్తల పరంపర ఆగిపోదని మరి కొందరి (అహ్మదీయులు) వాదం. విజ్ఞులు ఈ విషయమై ఆలోచించగలరు.


అసలు వాస్తవం కాదు - అవాస్తవం
ఆంధ్రజ్యోతి పాఠకచేరి 24-11-1990                                 
                                                                       
          21-11-1990 న 'అసలు వాస్తవం ఇదీ' అనే లేఖ ద్వారా అంకం ఏసురత్నం గారు అబద్దాలను ప్రజల మీద వెదజల్లారు. ఇరవై సంవత్సరాల నుండి అంటే నా పదవ ఏట నుండీ బైబిల్ ను క్షుణ్ణంగా పరిశీలించి చదివాను. క్రైస్తవ్యంలోని అనేక డినామినేషన్ల నుండి దాదాపు వంద సర్టిఫికేట్లు సంపాదించాను. ఇస్మాయిల్ గురించి ఆదికాండం 25 వ అధ్యాయంలో తప్ప బైబిల్లో మరెక్కడా లేదని అంకంగారన్నారు. దేవుడే ఏసుక్రీస్తు రూపంలో నరావతారం ఎత్తివచ్చాడనీ, ఒక ప్రవక్తను అరబ్బుల్లో నుంచి పుట్టించాల్సిన అవసరం దేవుడికి లేదనీ వ్రాశారు.

       అయితే క్రైస్తవ్యం ఈనాడు ఎవరికి ఎలా తోస్తే అలా ఉంది. అందరికీ అన్ని విధాలా అగుపడేందుకు బైబిల్ వీలుగా ఉంది. అందుకనే ఇన్ని వందల డినామినేషన్లు, ఇన్ని రకాల వాదాలు తలెత్తాయి. దేవుడు ఒక్కడేనా, ముగ్గురా అనే దానికి ఇంతవరకు బైబిల్ లో నుంచి   సమాధానం ఎవరూ రాబట్టలేకపోయారు. ఏసే దేవుడంటారు. ఆయన దేవుని కుమారుడంటారు. మళ్ళీ మనుష్య కుమారుడు అని కూడా అంటారు. ఆయన మూడు రాత్రింబగళ్ళు చనిపోయి సమాధిలో ఉన్నాడంటారు. దేవుడే చనిపోయినట్లు, ఆ మూడు రోజులు సృష్టి దేవుడు లేకుండానే ఉన్నట్లు వాదిస్తారు. నాదేవా నీవెందుకు నా చెయ్యి విడిచావు? అని ఏసుదేవుడు తనకు తానే మొరపెట్టుకుంటాడు. ఈ గిన్నె నా దగ్గర నుంచి  తొలగించమని పరలోకంలోని తనకే ప్రాధేయపడతాడు. చివరికి పరలోకంలో ఇద్దరు కనిపిస్తారు. సింహసనం మీద ఆసీనుడైన మహ వృద్ధుడైన తండ్రి, ఆయన కుడి ప్రక్కన నిలబడిన ఏసు మూడో దేవుడైన పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడో తెలియదు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 19-28 వచనాలలో ముహమ్మదు గారి ప్రస్తావన ఉంది. బాప్తిస్మమిచ్చే యోహానును యూదులు నీవు క్రీస్తువా, ఏలియావా, ఆప్రవక్తవా? అని అడుగుతారు. అతను నేను ఈ ముగ్గురులో ఎవరినీ కాను అంటాడు.
       ఆప్రవక్తఅంటే దేవుడు వాగ్దానం చేసిన చివరి ప్రవక్త. అతని కోసం యూదులు ఎంతగానో ఎదురు చూసేవారు. క్రీస్తు వేరు ఆప్రవక్త వేరు (యోహాను 7:40-43). 'ఆప్రవక్త' అంటే అందరికీ అర్థం అయ్యేది. అబ్రాహాము నుండి జ్యేష్ఠ కుమారత్వపు హక్కు ఇస్మాయిల్ కు సంక్రమించింది. (ద్వితీ 21:14-17). ఇస్మాయేలు వంశంలో ముహమ్మద్ జన్మించారు. గాడిద మీద ఎక్కి వచ్చిన ఏసు క్రీస్తు తరువాత ఒంటె ఎక్కి ఒక ప్రవక్త రావాలి(యెషయా 21:7). అతను అన్యభాషలో మాట్లాడాలి(యెషయా 28:11,12). 'ఆప్రవక్త' వర్ణన యెషయా 42 లో వివరంగా ఉంది. అతని పేరు షిలోహు అంటే సమాధాన కర్త. అతను రాగానే యూదుల మధ్య నుండి 'రాజ దండం' తొలిగిపోతుంది. (ఆదికాండం 49:10). సముద్ర వ్యాపారం, ఐశ్వర్యం కేదారు, వెబాయోతు (ఇస్మాయిల్ కుమారులు) వైపు త్రిప్పబడతాయి (యెషయా 60). రెండు మతాల దేవుడు, ప్రవక్తలూ ఒక్కరే గనుక కలిసిపోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి