ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

రైళ్ళు -బస్సులు,పోస్టాఫీసులు,గ్రంధాలయాలు,బ్యాంకులు





మంచి పథకం

        ఆంధ్రప్రభ 1-2-1987                                        
                   ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మహాసభ హైదరాబాద్ లో జరిగిన   సందర్భంగా మంత్రి శ్రీ రాజేష్ పైలట్ హైదరాబాదు చుట్టూ బైపాస్ రోడ్డు   వేయటానికి అంగీకరించటం హర్షదాయకం. అయితే ఇది రాజకీయ   నాయకులు చేసే వాగ్ధానం లాగా మిగిలిపోక కార్యరూపం దాల్చేటట్లు        హైదరాబాదులోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు. మునిసిపాలిటీ    వారు మంత్రి గారికి గుర్తు చేస్తూ ఉండాలి. నిధులు మంజూరు చేయించాలి.    ఈ రింగు రోడ్డు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పట్టణంలో రద్దీ       తగ్గుతుంది. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం  తగ్గుతాయి. మత కల్లోలం      చెలరేగితే బాదితుల రవాణాకు ఈ రోడ్డు ఉపయోస్తుంది. ఈ రింగు రోడ్డు తో     పాటు సర్క్యులరో రైల్ లైను కూడా చేస్తే ప్రజలు కృతజ్ఞులై ఉండగలరు. రాష్ట్ర        ప్రభుత్వం ఈ రెండు పథకాల విషయమై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలి.


ప్రతి రోజు బస్ పాస్ లు ఇవ్వాలి

        ఆంధ్రజ్యోతి 12-12-1985                                 
                   హైదరాబాద్ పట్టణ రవాణా వ్యవస్థలో మౌలికమైన మార్పులు చాలా రావలసి ఉంది.
              ప్రతి సెంటర్ లోను కనీస విచారణ సౌకర్యాలతో బస్సు స్టేషను నెలకొల్పాలి. బస్సుల మీద, ఆవి పోయే రూట్ లో తగిలే స్టేషన్ల పేర్లు     వ్రాయాలి. ఎస్.జి.ఓ. లను విద్యార్ధులకు పాస్ ల కోసం ఫారాలు ఒక రోజు,        పాస్ లు మరో రోజు, రెన్యూవల్స్ మరో రోజు అలా తేదీలు నిర్ణయించారు.     క్రొత్తగా హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిన వారు 17 వ తేదీ వరకు పాస్ కోసం        ఆగాలి. ఆ తేదీలలో పాస్ వినియోగదారులు అసంఖ్యాకంగా     క్యూకడుతున్నారు. నెలపొడవునా ఆదివారాలతో  సహా అన్ని రోజులు ఈ    పాస్ లు మంజూరు చేస్తే తప్పేమిటి?

              వనస్థలిపురం నుంచి ఇంకా రెండు బస్సులైనా పెంచాలి. అలాగే        పట్టణాల సరిహద్దు ప్రాంతాలలో బస్సు స్టేషన్ లు, పాస్ ల మంజూరీ విస్తృతం   చేయాలి. రూట్ మ్యాప్ లు ముద్రించాలి. రోడ్ల పేర్లు సూచించే బోర్డులు కట్టాలి.


సెలవు ఎందుకు?
                                                                                                                           
              జాతి మనుగడకు అత్యవసరమనుకున్న సర్వీసులకు   సెలవులుండవు. రైళ్ళు, బస్సులు, పాలు, నీరు, విద్యుచ్ఛక్తి సరఫరా లాంటివి. వాటిలో కొన్ని అలాంటివి  సర్వజనానికి ఎంతో అవసరమైన       పోస్టాఫీసులకు సెలవులు ఇస్తున్నారు. పోస్టాఫీసులకు సెలవులు ఎందుకు?   ఇంటర్వ్యూ కార్డులు, మరణవార్తలు, అత్యవసర సమాచారాలు, పోస్టాఫీసుల        ద్వారా అందుతాయి. ఒక్కరోజు సెలవు వస్తే దేశం స్తంబించి పోతున్నది.     కొందరి ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి. కొందరికి చివరి చూపులు    దక్కడం లేదు. కానీ ప్రభుత్వం పోస్టాఫీసులను కూడా అత్యవసర     సర్వీసులుగా పరిగణించి, వాటికి సెలవులు లేకుండా చెయ్యాలి. అవసరమైతే   సిబ్బంది సంఖ్యను పెంచి దీనిని అమలు చెయ్యాలి.


సమన్వయం లేని రెండు ప్రభుత్వ సంస్థలు
          తంతి తపాలా, ఆర్.టి.సి. రెండూ ప్రభుత్వ సంస్థలే అయినప్పటికీ ఆ రెంటి మధ్య సామరస్యం లేదు. ఒంగోలు నుంచి రైలు లైను లేని ఒంగోలు-చిలకలూరిపేట, ఒంగోలు-కనిగిరి, ఒంగోలు-దరిశి రోడ్లమీది ఊళ్ళ ప్రజలకు పోస్టు అందాలంటే ఆర్. టి.సి బస్సులే శరణ్యం. అలాంటిది ఒంగోలు ఆర్. ఎమ్. ఎస్. వారు ఆర్.టి.సి బస్సులలో పోస్ట్ బ్యాగ్ లు వేస్తుంటే బస్సు కండక్టరు నిరాకరిస్తున్నారు.

       ఒకవేళ బస్సులలో వేసుకొన్నా సరయిన సమయానికి పోస్టల్ సిబ్బంది బ్యాగ్ లు దించుకోక అవి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఒక్కోసారి నాల్గు రోజుల ఉత్తరాలు కలిపి ఒక రోజు బట్వాడా చేస్తున్నారు. ఇంటర్వ్యూ కార్జులు అందక ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఈ పద్ధతి వల్ల ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు నిరాశ చెందుతున్నారు.
       కాబట్టి,  ఈ రెండు డిపార్టుమెంట్లు సామరస్యం వహించి, ప్రజలకు ప్రయోజనం కలిగేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను.


ప్రతి ఎక్స్ ప్రెస్ ను జిల్లా కేంద్రంలో ఆపాలి
                                                           
          ఆంధ్రప్రభ 29-4-1985                                              

                        రైల్వే మంత్రి బన్సీలాల్ చాలా కర్కశంగా మరే రైల్వే మంత్రి గతంలో   పెంచనంతగా చార్జీలు పెంచేశారు. పైగా ఆయన పనిగట్టుకొని ఆంధ్రప్రదేశ్  మీద పగ తీర్చుకొంటున్నారు. సర్వే పూర్తయిన క్రొత్త రైలు మార్గాలను సైతం  ఆయన ఆమోదించలేదు. కనీసం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను నెల్లూరు లో      ఆపమని కోరితే ససేమిరా ఆపము అన్నారు. నా సూచన ఏమిటంటే, దేశం లోని ఎంత గొప్ప ఎక్స్ ప్రెస్ అయినా జిల్లా కేంద్రాలలో తప్పనిసరిగా ఆగాలి. కోరమాండల్, తమిళ నాడు, త్రివేండ్రం, వారణాసి, కేరళ, మొదలైన ఎక్స్ ప్రెస్    రైళ్ళు ఒంగోలు, నెల్లూరు లో రెండు నిముషాల పాటు ఆగితే కేవలం ఆయిదు నిముషాలు మాత్రమే ఆలస్యం జరుగుతుంది గానీ దాదాపు మూడు వేల మంది ప్రయాణీకులకు మేలు జరుగుతుంది. రాజధాని లోని సంపన్నులకు మాత్రమే ఉపయోగించే ఇలాంటి రైళ్ళ పైన, ఖర్చును    పన్నుల రూపంలో జిల్లాలలోని ప్రజలే భరిస్తున్నారు. కనుక ప్రతి ఎక్స్ ప్రెస్  ను జిల్లా కేంద్రాలలో తప్పనిసరిగా ఆపాలి.


పోస్టల్ శాఖను పట్టా లెక్కించాలి
ఈనాడు 20.4.85                                                                                                           
              మన ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశ        పెట్టవలదలచుకున్నట్లు ప్రకటించారు. జాతి జీవనంలో ప్రధాన మైన రైళ్ళు, బస్సులు, పాలకేంద్రాలు, పోస్టాఫీసులు, నీరు, విద్యుచ్ఛక్తి సరఫరా కేంద్రాలలో ఎలాంటి అంతరాయాలు రాకుండా చూడడం అత్యవసరం. ప్రస్తుతం, పోస్టు, టెలిగ్రాఫ్ శాఖలు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. మర్నాడు    చేరవలసిన ఉత్తరాలు 3,4 రోజుల తర్వాత చేరుతున్నాయి.ఇంటర్వ్యూకార్డులు ఆలస్యంగా అందటం వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న యువకులు అనేక మందున్నారు. టెలిగ్రాములు సకాలానికి చేరక     ఆత్మీయులను కడసారి చూడలేకపోవడం తరచుగా జరుగుతున్నదే. మన      ప్రధాని మొట్టమొదట సంస్కరించవలసింది పోస్టల్ డిపార్టుమెంటునే. ఆ  శాఖ పరిస్థితి రాను రాను క్షీణిస్తున్నదన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. సిబ్బంది కొరత ఉంటే, దాన్ని తొలగించి, పోస్టల్ శాఖను మళ్ళీ పట్టాల మీదకు తేవాలి. పరిపాలనలో సామర్ధ్యం ఉంటే ప్రజలకు వెను వెంటనే   తెలిసిపోతుంది.


Holiday postal counters
Indian Express 20-3-1985                                         
                                                                                      
                                                                                     
                    Railways, bus services, water, milk and electricity are as   essential as food, water and clothing. These departments are not           given holidays, in view of their obvious importance in pulic life.   But the Posts and Telegraphs department has holidays though it is          the most essestial service of all of them.

                   Some of the things that draw the attention of the postal     department even on holidays are death, interview cards and the       like. On holidays, the whole world seems to move round the posts.
         
                   Mr. N. Rahamthulla, Telugu Ganga Project, Nellore 524 003    requests the department to consider a proposal for setting up       holiday postal counters on an experimental basis.


     
  రైలు మార్గాలు విస్తరింప చేయాలి
ప్రజాశక్తి 28-12-1990                                         నూర్ బాషా రహంతుల్లా    
                                                                  ఏలూరు
                                                               
          మన రాష్ట్రంలో కరీంనగర్, మెదక్ జిల్లా కేంద్రాలకు రైలు మార్గం లేనందున అని వెనుకబడివున్నాయి. పెరుగుతున్న జనాభాతో బాటు రైలు మార్గాలు పెరగటం లేదు. భద్రాచలం, అమలాపురం, నాగర్ కర్నూల్, సిద్దిపేట పార్లమెంటు స్థానాల గుండా రైలు మార్గం లేదు. అలాగే ఉట్నూరు, బోద్, అసిషాబాద్, జిగిత్యాల, చేవెళ్ళ, నారాయణ పేట, వనపర్తి, జమ్మల మడుగు, మదనపల్లి, కందుకూరు, కొత్తగూడెం, సర్కాల, నర్మీపట్మం, పాడేరు, పాలకొండ మొదలైన రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు కూడా రైలు మార్గాల విస్తరణ జరుగలేదు. కీర్తి శేషులు పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్ర లో ప్రజారాజ్యం అనే పుస్తకంలో 12 రైలు మార్గాలు వేయాలని ఏనాడో కోరారు. అవి ఈనాటికీ నిర్మించబడలేదు. ఆయన జీవిత కాలంలో ఈ రైలు మార్గాలను చూడలేక పోయారు. బొగ్గు, సిమెంటు, ఎరువులు, ముడి ఇనుము, ఆహార ధాన్యాలు పంచదార, బెల్లం, చేపలు, పండ్లు మొదలైన వస్తువులు మన రాష్ట్రం నుండి రవాణా అవుతున్నాయి. వీటి రవాణా కోసం రైలు మార్గాలు ఎంతో అవసరం. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజా ప్రతినిధులందరూ కలిసి పార్లమెంటులో ఈ రైలు మార్గాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవాలి. రైలు మార్గాల విస్తరణ వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. వేలాది పేద కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రోడ్డు రవాణా గణనీయంగా తగ్గి రోడ్లపై భారం తగ్గి పటిష్టంగా ఉంటాయి. కనుక రైలు మార్గాల సాధనకై రాష్ట్ర ప్రజలంతా గట్టిగా కృషి చేయాలి.



ఉపయోగపడని రైళ్ళు
ఆంధ్రజ్యోతి 16-3-1991                                      
          మన రాష్ట్ర కోస్తా తీరపు ప్రధాన రైలు మార్గం మీద దాదాపు 26 రైళ్ళు నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి ఈ మార్గం మీద ఏలూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లా కేంద్రాలున్నాయి. అయితే ఈ స్టేషన్లలో కూడా 10 రైళ్ళ కంటే ఎక్కువ ఆగడం లేదు. త్రివేండ్రం – న్యూఢిల్లీ, మద్రాసు-హౌరా, మద్రాసు-వారణాసి, మద్రాసు-న్యూఢిల్లీ, గౌహతి-త్రివేండ్రం, హౌర్-కొచ్చిన్, పాట్నా-కొచ్చిన్, బెంగుళూరు-గౌహతి, కొచ్చిన్-గౌహతి, బెంగుళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ లు ఈ జిల్లా కేంద్రాలలో ఆగడం లేదు.
      
       రైల్వే మంత్రిత్వ శాఖ జిల్లా కేంద్రాల స్టేషన్లలో అన్ని రకాల ఎక్స్ ప్రెస్ లు ఆగేలా చర్యలు తీసుకోవాలి. మన ప్రాంతం మీదుగా వెడుతూ మనకు ఉపయోగించని రైళ్ళ వల్ల ఏమిటి ప్రయోజనం? దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలి.



బస్సుల సంఖ్య పెంచాలి
ఆంధ్రజ్యోతి 31-8-1990              
                                                                       
          భీమవరం నుంచి జిల్లా కేంద్రమైన ఏలూరుకు చాలా తక్కువ బస్సులు నడుస్తున్నాయి. భీమవరం నుంచి ఏలూరు వెళ్ళాలంటే కృష్ణా జిల్లాలోని కైకలూరు మీదుగా తిరిగి రావలసి వస్తున్నది. రోడ్లు భవనాల శాఖ వారు మరో దగ్గర రోడ్డును అభివృద్ధి చేయలేదు. కైకలూరు రోడ్డు కూడా అడుగులోతు గతుకులతో అధ్వాన్నంగా ఉంది. భీమవరం నుంచి ఏలూరుకు ప్రయాణం చేస్తే పట్టే కాలం కంటే బస్సు కోసం ఎదురు చూడడానికి రెండు రెట్లు ఎక్కువ సమయం వృధా అవుతున్నది. రెండు డిపోల మేనేజర్లు దయచేసి  బస్సుల సంఖ్య పెంచాలి.

 వడ్డీ ఎగవేసిన స్టేట్ బ్యాంక్
ఆంధ్రప్రభ 22-2-1990                                              నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాద్
చీరాల ఎస్.బి.ఐ నుంచి 14 వేల రూపాయలు నిలువ ఉన్న నా పాస్ పుస్తకాన్ని పాత మలక్ పేటకు బదిలీ చేయవలసిందిగా కోరితే వాళ్ళు సికిందరాబాద్ లోని మార్కెట్ స్ట్రీట్ కు పంపారు. ఈ పొరపాటు గ్రహించిన మార్కెట్ స్ట్రీట్ బ్రాంచ్ వాళ్ళు పాత మలక్ పేటకు పంపకుండా వారి బ్రాంచిలోనే అకౌంట్ తెరచి మెదలకుండా కూర్చున్నారు. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడికి చేరిందో తెలియక రెండు నెలల పాటు ఇరు బ్రాంచీల వారు మల్లగుల్లాలు పడ్డారు. 19-8-89 న ఉత్తరప్రభలో ఈ గోడు తెలుపుకుంటే చీరాల బ్రాంచి వారు ఒక డూప్లికేట్ డి.డి. జారీచేశారు. చీరాల బ్రాంచీలో 20-6-89 న జమచేసిన 14 వేల రూపాయలు బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వెంటనే బదిలీ కాక 29-8-89 వరకు నాకు చేరలేదు. (ఖాతా సంఖ్య అగ్రి – 6/538 చీరాల 2094/11 పాత మలక్ పేట).
మరి ఈ రెండు నెలల కాలానికి 14 వేలకు వడ్డీ చెల్లించే బాద్యతను పై బ్రాంచి కూడా స్వీకరించలేదు. ప్రజలకు వడ్డీకి ఇచ్చేటప్పుడు బంగారు నగలు తాకట్టు పెట్టుకుని చెవులు పిండి వడ్డీ వసూలు చేసే బ్యాంకు, వారికివ్వాల్సిన వడ్డీని కూడా చెల్లించవద్దా ? చదువుకుని పట్టణంలో ఉంటున్న నాకే ఇన్ని అవస్థలు ఎదురయితే – చదువురాని పల్లెటూళ్ళ జనం పరిస్ధితి ఇక ఎలా ఉంటుందో గదా ‍! పాస్ బుక్కు బదిలీ చేయడానికి నెలల తరబడి గడపడం, ఈ మధ్య కాలానికి వడ్డీ చెల్లించకపోవడం బ్యాంకులు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. బ్యాంకులు ప్రజలకు చేరువకాకపోగా ప్రజాకంటకంగా పరిణమించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి