ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఆగస్టు 2013, బుధవారం

అవినీతి



మామూళ్ళు పలు రకాలు
                                                           
                        వివిధ రకాల మామూళ్ళలో దసరా మామూలు ఒకటి. కష్టపడకుండా సంపాదించాలనే దురాశే దీనికి కారణం. ఇది మధ్య తరగతి ఉద్యోగులను  బాధపెట్టే సాంఘిక దురాచారం. పోలీసులు, అటెండర్లు, పోస్టుమన్ లు ఇలా ఈ మామూలు అడిగేవారికి అంతుండదు. పైగా దసరా మామూలు వసూలు     చేసుకోవడానికి వాళ్ళలో వాళ్ళు వేలం పాట పెట్టుకుంటారు. పాట   పాడుకున్న వాడు సాధ్యమైనంత ఎక్కువ గుంజుకోవాలని చూస్తాడు. ఇది   కూడా అవినీతికర పద్థతే ప్రభుత్వం దీనిని లంచగొండితనంగా పరిగణించి దసరా మామూళ్ళను నిషేదిస్తూ చట్టం చేయాలి.


పోలీసులు : పరివర్తన
         
 ఆంధ్రప్రభ 28-12-1986                                   
  ఆంధ్రప్రభలో పోలీసు కస్టడీలో బల ప్రయోగం అనే బాలగోపాల్ గారి   వ్యాసం పోలీసులకు, నాయకులకు ప్రజలకు కళ్ళు తెరిపించేదిగా ఉంది.  నేరస్తుల ప్రాణరక్షణకు రాజ్యాంగంలో అన్ని ఏర్పాట్లు ఉన్నట్లు నాకు         వ్యాసం ద్వారా తెలిసి ఆశ్చర్యపోయాను. సామాన్య జనం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే శిక్షలున్నాయి. పోలీసులు రాజ్యాంగాన్ని  అతిక్రమిస్తే శిక్ష   ఉండవద్దా? లాకప్ మరణానికి కారకులైన వారికి మరణశిక్ష వెయ్యాలి.  మహాత్మాగాంధీ గారి ఫొటోలు ఉంచడం వల్ల కూడా ప్రయోజనం కలుగలేదు. పోలీసులలో పరివర్తన రాలేదు. అందువలన నవ్వుతూ కన్పించే  మహాత్మునికి బదులుగా దుఃఖిస్తూ కన్పించే గాంధీజీ ఫొటోలను పోలీసు      స్టేషన్లలో ఉంచాలి. అప్పటి కైనా లాకప్  పోలీసుల్లో మార్పు రావచ్చు. పోలీసులకు దైవభక్తి, తీర్పుదినం, స్వర్గనరకాలను గురించిన బోధ, నైతిక    విద్యలలో తరచుగా శిక్షణ ఇప్పించాలి.


ధనాపేక్ష
                                                                                                   
                                                                                        
                        ధనాపేక్ష సకల కీడలకూ మూలంఅని సూక్తి. టపటపా  కూలిపోతున్న భవనాలు, ప్రాజెక్టులు, టన్నెల్స్ వగైరాలు చూస్తే ఈ సూక్తి      నేటికీ ఎంత ప్రాముఖ్యం కలిగి ఉందో అర్ధమవుతుంది. కవిగారు చెప్పినట్లు ఇంజనీరు, కాంట్రాక్టరు వియ్యంకుల కయ్యంలో తీర్పరియై  లక్ష్మీదేవితిరుగలేక చస్తోంది. సిమెంటును మారుపేరు ఇసుక దూరుటను చూసిన    ప్రాజెక్టులు కడుపుమండి 'పేకమేడ'ల్లా కూలిపోతున్నాయి. అయితే    ఇంతవరకు జరిగిపోతున్నా, కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వాధినేతల్లో ఇసుమంత   కూడా చలనం కనిపించలేదు. అవును మరి. వారు స్థిత ప్రజ్ఞులు కదా! అయితే సామాన్యుల సాధారణ బుద్ధికి ప్రభుత్వం ఇంతకాలం ఎందుకని    మౌనం వహించిందో స్పష్టంగానే అర్ధమయింది. ఒకనాటి కాంట్రాక్టర్లు మరునాడు రాజకీయ నాయకులుగా పరిణామం చెందడం దాని వెనుక   నున్న ముఖ్యకారణం. తెలుగుదేశానికి సుదీర్ఘమైన రాజకీయచరిత్ర లేదు    కనుక, ఇలాంటి వారసత్వం ఉన్న నాయకత్వం కూడా లేదు. పైగా తన లక్ష్యం ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని తొలగించడం అని తెలుగుదేశం  చెపుతోంది. వెంటనే కన్నంలోని కాంట్రాక్టర్, ఇంజనీర్ దొంగల్ని, కన్నంలోనే     పట్టుకోవాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతన్నాం.


దొరికే దొంగలు
         

  ఆంధ్రప్రభ 16-8-1987                                           
                   దొరికే దొంగలు అనే సంపాదకీయంలో లంచగొండితనాన్ని    అదుపులో పెట్టవలసిన అయిదు పేరు మోసిన ప్రభుత్వ శాఖలను సూచించారు. అవి : - 1. పోలీసు 2. వాణిజ్య 3. అబ్కారీ, రవాణా 4. రిజిస్ట్రేషన్    5. భూసేకరణ [పి.డబ్య్లూ.డి]. 'తెలుగుదేశం' ప్రభుత్వం తలపెట్టిన క్విట్ కరప్షన్ అనే ఉద్యమం పైశాఖలలోని ఉద్యోగుల దృష్టిలో ఎలా ఉంటుందో  కొంచెం ఆలోచించండి? ఉద్యోగులు అధికారులకు అధికారులు నాయకులకు తాబేదారులుగా మారి అందరూ కలిసి తమ బొజ్జలు నింపుకోవడం వల్లనే  గదా ఇది ఒక విషవలయంగా మారింది. దేశాన్ని దోచుకున్న ఇలాంటి దొంగలు విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారు. జాతీయాదాయంలో  30 శాతం దాకా ప్రతిఏటా నల్లధనం పోగుచేస్తున్నారు. లంచగొండితనానికి ఎంత మంది ఉద్యోగులు వ్యతిరేకులో చెప్పండి.


కొంప ముంచుతున్న 'ఓ.టి' అలవెన్స్
           

        ఈనాడు లేఖలు 7-3-89                                 
                   ఓవర్ టైమ్ అలవెన్స్ స్థానే ఎక్ స్ట్రా వర్క్ అలవెన్స్ ఇచ్చే విషయం    కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు హోం శాఖ సహాయమంత్రి శ్రీ చిదంబరం   ప్రకటించారు. ఓవర్ టైమ్ అలవెన్స్ ను నాలుగో వేతన సంఘం రద్దు  చేసింది. చేసిన పనితో నిమిత్తం లేకుండా కేవలం కాలాన్నే ప్రాతిపదికగా   తీసుకోవటం వల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఓవర్ టైమ్ కింద ప్రభుత్వం చెల్లించవలసి వచ్చింది. పని చెయ్యకుండానే కార్యాలయంలో  కాలక్షేపం చేసి డబ్బులు దండుకునేందుకు ఈ ఓవర్ టైమ్ అలవెన్స్ వరప్రసాదం అయ్యింది. అసలు జీతం కంటే ఈ అలవెన్స్ ఎక్కువైన  సంఘటనలు కొల్లులు. ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలకు ఓ.టి. పేరిట జరిగే దుబారా కూడా ఒక కారణమని పరిశీలకులు తెలియచేశారు.


కాంట్రాక్టర్ల రాజ్యం  
                                                           
                                                                            
                        నాగార్జున సాగర్, కుడి, ఎడమ కాల్వలమీద రెండు ఆక్విడక్టులు  కూలిపోవడం, ఇంకా అనేకం కూలిపోయే దశలో ఉండటం, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, అసమానతలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో వివరించి చెప్తున్నాయి. ఆ సంఘటన మీద విచారణకు నియమితులైన    అధికారులిద్దరూ అవినీతి ఆరోపణలకు గురై చార్జీషీటు అందుకొన్నవారే. ఫలితంగా, కుడి కాల్వ మీది ఆక్విడక్టులు తేల్చేశారు. వాటిని ఇసుకతో  కట్టించి, సిమెంటు, డబ్బు దొంగిలించిన కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను శిక్షించే     దమ్ము ప్రభుత్వానికుందా? శిక్ష విధించాల్సిన వాడూ వేసిన శిక్షను అనుభవించాల్సిన వాడూ, ఇద్దరూ దొంగా దొంగా కలిసి ఊళ్ళు  పంచుకున్నట్టు ప్రజల సొమ్మును దిగమింగుతుంటే, ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది?


Prem Marg  6/1983                                                         N. Rahamthulla
                                                              Chimakurthy
                                                                                        
                   “The article Gift of the Grab (April is a timely article. I too have the  same thoughts. The author rightly divided the roots of the corruption as   greed and poverty. The insatiable greed and deceitful games of the rich, the  struggle for survival of the poor are the factors shown by the author, Jayaprakash Narayan's words are correct. There is enough for every one’s need. There is not enough for any one’s greed. The problem is within man,   but not in the land. People’s hearts must be converted”.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి