ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

చిన్న రాష్ట్రాలు



    చిన్న రాష్ట్రాలు -ప్రాంతీయ మండళ్ళు
ఆంధ్రభూమి 27-6-1990                           నూర్ బాషా రహంతుల్లా,ఏలూరు

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఒక్క బి.జె.పి. మినహా మిగతా పార్టీలన్నీ విముఖత చూపటం విచారకరం. లక్ష చదరపు కిలోమీటర్ల వైశాల్యం పైబడిన రాష్ట్రాలు మన దేశంలో 11 ఉన్నాయి. వాటిని చీల్చి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ ప్రాంతాల ప్రయోజనాలు చిన్న రాష్ట్రాల వల్ల రక్షించబడతాయి.

 స్థానిక స్వపరిపాలన సిద్ధిస్తుంది. ప్రజలకు దూరము, భారము తగ్గి పరిపాలన చేరువలో నాణ్యతతో దొరుకుతుంది. తాలూకాలను మండలాలుగా చీల్చినందువల్ల పాలనా సౌకర్యాలు ప్రజలకు చేరువ అయినట్లుగానే  చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల కూడా సౌలభ్యం కలుగుతుంది. కోలారు, పావడ, బళ్ళారి, బస్తర్, శిరివంచ, భాల్సా, గంజాం, కోరాపుట్, పొన్నేరి, తిరువళ్ళూరు, గుడియాత్రం, హోసూరు, కృష్ణగిరి తాలూకాలను కలుపుకొని ఒక్కొక్కటి 70 వేల చ.కి.మీ. వైశాల్యంతో మనకు 4 తెలుగు రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యాలి.


    చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి
ఆంధ్రప్రభ 6-7-1990                                 నూర్ బాషా రహంతుల్లా,ఏలూరు

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఒక్క బి.జె.పి. మినహా మిగతా పార్టీలన్నీ సుముఖంగా లేకపోవటం విచారకరం. లక్ష చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని మించిన రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. వాటిని చీల్చి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరిపాలనా సౌలభ్యం  కోసం, ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువకావటం కోసం, స్థానిక స్వపరిపాలన మరింత ఘనంగా సాగటం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు తప్పనిసరి. చిన్ని రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశం విచ్ఛిన్నమవుతుందనే వాదంలో నిజం లేదు. మండలాల ఏర్పాటు వల్ల మన రాష్ట్రం విచ్చిన్నం కాలేదు. పరిపాలనలో నైపుణ్యం, నాణ్యత పెరిగాయి. ప్రజలకు దూరాభారాలు తగ్గాయి. అలాగే మనకు కోలారు, పావగడ, బళ్ళారి, బస్తర్, శిరివంచ, గంజాం, కోరాపుట్, పొన్నేరి, తిరువళ్ళూరు, గుడియాత్రం, కోగూరు, కృష్ణగిరి తాలూకాలను కలుపుకొని నాలుగు తెలుగు రాష్ట్రాలు ఏర్పడాలి.


చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి
ఆంధ్రజ్యోతి 30-6-1990                          నూర్ బాషా రహంతుల్లా,ఏలూరు

1956 నవంబర్ లో 15 రాష్ట్రాలు, ఒక్క కేంద్ర పాలిత ప్రాంతంతో వున్న మన దేశం ఈనాడు 25 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అయినా ఇంకా దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. 30 సంవత్సరాలలో 10 కొత్త రాష్ట్రాలను, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఆనాడు తెలుగు ప్రజలు నడిపిన ఉద్యమాన్ని మనం గుర్తుతెచ్చుకోవాలి. అలాంటి ఆవేశమే ప్రస్తుతం ఉద్యమాలు నడుపుతున్న వారందరికీ ఉంటుంది. తెలంగాణా, విదర్భ, జార్ఖండ్, గూర్కాలాండ్, బోడోలాండ్, సౌరాష్ట్ర, జమ్ము మొదలైన రాష్ట్రాలన్నీ ఏర్పడాలి. ఒక్క బి.జె.ప. మినహా అన్ని పార్టీలు చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించడం శోచనీయం. అధికార వికేంద్రీకరణకు చిన్న రాష్ట్రాల ఏర్పాటే పరాకాష్ట, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనివార్యం. ప్రజలు వాటిని సాధిస్తారు. 



బి.జె.పి.లో చేరుము
ఆంధ్రభూమి 28-3-1991                                                  
                                                               
       చిన్న రాష్ట్రాల ఏర్పాటు కు బిజెపి వాగ్ధానం చేసింది. మర్రి చెన్నారెడ్డి గారు మజ్లిస్ తో చేతులు కలిపి త్వరలో 'తెలంగాణా' ఉద్యమం తెస్తారట. జి.వి. సుధాకర్రావు లాంటి వాళ్ళూ అలాంటి కేకలే వేస్తున్నారు. తెలంగాణా, రాయలసీమ, విధర్భ, బోడోలాండ్, ఉత్తర ఖండ్, జార్ఖండ్, కూర్గు, సౌరాష్ట్ర,  అహోంలాండ్, బ్యారక ల్యాండ్, జమ్ము, కొంకణ్, లడఖ్ మొదలైన ఉద్యమాలు సాగాయి. సాగుతున్నాయి. ఆయా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కారులంతా చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించే పార్టీల్లో ఉండేకంటే బిజెపిలో చేరితే బాగుంటుంది. హింసాకాండ జరక్కుండానే ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు అవుతాయి. చుట్టరికం, పేరిట కలిసి వచ్చినట్లు అవుతుంది.



చిన్న రాష్ట్రాలే మేలు
ఆంధ్రజ్యోతి 22-11-1991                                                   
                                                               
          రాష్ట్రాల పునర్విభజనపై బి.జె.పి. పిలుపును తిప్పికొట్టాలని సి.పి.ఎం. విజ్ఞప్తి చెయ్యడం దురదృష్టకరం. పెద్ద పెద్ద రాష్ట్రాల వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరం పెరుగుతోంది. ప్రాంతీయ అసమానతలు పెరిగు అభివృద్ధి కుంటుపడుతోంది. చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పాటైతే అధికార వికేంద్రీకరణ జరిగి స్థానిక స్వపరిపాలన పరిపుష్టమవుతుంది. బి.జె.పి మతతత్వ పార్టీయే కావచ్చు. అది ప్రతిపాదించే డిమాండ్లలో ప్రజలకు లాభకరంగా ఉండే వాటిని మిగతా రాజకీయ పార్టీలు ఆమోదించడం తప్పేమీ కాదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి