ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

ఆరోగ్యం



పందులను చంపి తీరాలా?
                                                           
          ఈనాడు 21-11-1986                                           

                        ఎరుకల వాళ్ళు పెంచుకునే పందుల్ని చంపి వాళ్ళ పొట్టకొట్టవద్దని    రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడం హర్షదాయకం. దోమలను నిర్మూలించలేని       అధికారులు పందులమీద పడి చంపటం వారి అసమర్ధతకు నిదర్శనం.      హైదరాబాదులోని దోమలు మెదడువాపు వైరస్ ను వ్యాపింపజేయవు       అని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. కాని హైదరాబాదులోనే పోలీసులు        పందుల వేట భారీ ఎత్తున నిర్వహించారు. ఒకవేళ హైదరాబాదు పందుల్లో మెదడువాపు వైరస్ ఉన్నా హైదరాబాదు దోమలు ఆ వైరస్ ను వ్యాపింపచేయగలవు గదా? మరి పందుల్ని చంపటం ఎందుకు?       హైదరాబాదు అధికారులు పందుల మీద చూపిన ప్రతాపం దోమలమీద        చూపితే చాలా బాగుండేది.  ఇవాళ పందులు, రేపు అవులౌతాయి.   అందుకని ఈకీడంతటికీ మూలమైన దోమల సంహార కార్యాక్రమం       ప్రభుత్వం మొదలుపెడితే బాగుంటుంది.


'అందరికీ ఆరోగ్యం'
ఆంధ్రప్రభ 16-3-1991          నూర్ బాషా రహంతుల్లా,ఏలూరు

2000 సంవత్సరం నాటికి 'అందరికీ ఆరోగ్యం' మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. కాని ఆ దిశగా చేస్తున్నది చాలా స్వల్పం, రాష్ట్రంలోని 9 వైద్య కళాశాలలు ఏడాదికి కేవలం 960 ఎం.బి.బి.ఎస్. సీట్లు ఇవ్వగలుగుతున్నాయి. ఈ వైద్యుల సంఖ్య పెరిగే జనాభాకు అనుగుణంగా లేదు. గ్రామాలలో వైద్యుల అవసరం హెచ్చుగా ఉంది. అందువలన పదవ తరగతి అనంతరం 'డిప్లొమా ఇన్ మెడిసన్' లాంటి రెండేళ్ళ కోర్సు ఒక దానిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ప్రతి ఏటా పది వేల మంది అభ్యర్ధుల్ని చేర్చుకోవాలి. ఈ కోర్సు ఆర్.ఎం.పి.కి, ఎం.బి.బి.ఎస్. కూ మధ్యస్ధంగా ఉండాలి. ఇలాంటి డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రయోజనకరమైన సేవ చేస్తారు.



       గ్రామీణ వైద్యానికి ఫార్మసిస్టులు
ఈనాడు 26-12-2001                                               
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొరతను నివారించడానికి వీలుగా  ప్రాధమిక వైద్యం చేయడానికి ఫార్మసిస్టులను కూడా అనుమతిస్తే బాగుంటుందేమో పరిశీలించాలి. అనేక మంది ఎం.బి.బి.ఎస్. డాక్టర్లు గ్రామాల్లో పనిచేయడానికి ఆసక్తి కనబరచనందున గ్రామాల్లో ఏ మాత్రం అర్హత లేనివారు వైద్యం చేస్తున్నారు. దాని వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏ రోగానికి ఏ మందు పనిచేస్తుందో ఫార్మసిస్టులకు బాగా తెలుసు. ఆపరేషన్లు అవసరం లేని తేలికపాటి రోగాలకు వైద్యం చేసే అవకాశం ఫార్మసిస్టులకు కల్పించవచ్చు. ఇందుకోసం ఫార్మసీ విద్యార్థులకు చికిత్సా పద్ధతులు కూడా సిలబస్ లో చేర్చితే వారు నేర్చుకునే విద్య ఉభయతారకంగా ఉంటుంది. 



పాఠశాల స్థాయి నుంచే వైద్య విద్య
ఈనాడు 10-10-2001                                                 
                                                 
శాస్త్ర సాంకేతిక రంగాలలో మంచి మార్పులొచ్చి నిజమైన శాస్త్రజ్ఞులు, పనికొచ్చే మేధావులు తయారు కావాలంటే విద్యారంగంలో కొన్ని చర్యలు చేపట్టాలి. వైద్య శాస్త్రంలోనూ పాలిటెక్నిక్ కోర్సులు ప్రవేశ పెట్టి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స సేవల కోసం ఆ అభ్యర్థులను వినియోగించుకోవాలి. పాఠశాల స్థాయినుంచే ఫార్మసీ పాఠాలు బోధించాలి. ఫార్మసిస్టులను ఉన్నత వైద్య విద్య కోర్సుల్లోకి ఆహ్వానించి వారి ఔషద విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి ఈ అంశాలను పరిశీలించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి