ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

గిరిజనులు -కార్మికులు



'గాలి' తలుచుకుంటే ఉపాధికి కరువా?
           

        ఆంధ్రజ్యోతి 8-1-1989                                      
                   మన రాష్ట్రంలో ప్రస్తుతం 30 లక్షల మంది నిరుద్యోగులున్నారనీ, ప్రతి        ఏటా కొన్ని లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగులు కళాశాలల నుండి       బయటకొస్తున్నారనీ, ఈ నిరుద్యోగ నిర్మూలన అసాధ్యమని అటవీ శాఖ        మంత్రి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పటం శోచనీయం. గౌరవనీయ మంత్రి    తలుచుకుంటే తన శాఖలోనే కొన్ని లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చునని       సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రస్తుతం 68 వేల చదరపు కిలోమీటర్ల      సారవంతమైన భూమి అటవీశాఖ ఆధీనంలో ఉంది. ఇందులో నాల్గవ వంతు       భూమిని వ్యవసాయము, పండ్ల తోటల పెంపకం నిమిత్తం నిరుద్యోగులకు    ఒక్కొకరికి అర ఎకరం చొప్పున పంచినా లక్ష మందికి పైగా ఉపాధి   లభిస్తుంది. వన్యమృగ సంరక్షణ పేరుతో వేలాది ఎకరాలు అభయారణ్యాల      క్రింద మూసివేయటం ఆపి, వ్యవసాయ కూలీలకు, నిరుద్యోగ యువకులకు      భూమిని పంచితే బాగుంటుంది. గిరిజనుల్ని అడవులనుండి పట్టణాలకు        తరుమకుండా వారికి అక్కడే ఇళ్ళూ, భూములు ఇస్తే ఎంతో మేలు   జరుగుతుంది.


ఏమిటీ వైపరీత్యం ?
           

        ఆంధ్రప్రభ 18-3-1989                                      
                   ప్రస్తుతం మన రాష్ట్రం లోని షెడ్యూల్డ్ ప్రాంతాలలోని జనాభాలో 52     శాతం గిరిజనులు, 48 శాతం గిరిజనేతరులు ఉంటే, పట్టా భూముల్లో 44     శాతం గిరిజనుల పేరిట, 56 శాతం గిరిజనేతరుల పేరిట ఉన్నట్లు తేలింది.      వాస్తవానికి 70 శాతం భూమిని, గిరిజనేతరులే అనుభవిస్తున్నట్లుగా     ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆరోపిస్తున్నది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర        ప్రభుత్వం 1970 భూమి బదలాయింపు నిరోధక రెగ్యులేషన్ ను రద్దు చేసింది.      భూమి కోల్పోయిన గిరిజనులు అడవుల బయటికి నెట్టి   వేయబడుతున్నారు. కొత్త భూమిని వెతుక్కుందామంటే అన్నీ 'రక్షిత      వనాలు', 'మృగవనులు' ఒకవైపు గిరిజనేతరులు అటవీ భూమిని సొంతం చేసుకుంటూ ఉండగా, మరో వైపు దేశంలోని మూడవ వంతు భూమిని        'ప్రభుత్వ అడవి' గా మార్చటానికి కొత్త అటవీ చట్టాన్ని ఆమోదించారు.       గిరిజనులు తమ భూమి మీదనే కూలీలుగా ఉండవలసి వచ్చింది. ఏమిటీ వైపరీత్యం?


విప్లవమంటే ఇదేనా ?
ఈనాడు 30-6-1986     ఎన్. రహంతుల్లా    హైదరాబాద్
                     మనుషుల మలాన్ని మోసుకు పోయే పారిశుధ్య పనివారల   దుస్థితి అంతరించాలని రాష్ట్రపతి జ్ఞానీజైల్ సింగ్ ఆ మధ్య చాలా బాధపడ్డాడు. బొంబాయిలో వీదులూడ్చే యంత్రాలు ప్రవేశపెడితే తగల బెడతామని శ్రీ జార్జీ ఫెర్నాండెజ్ ఆవేశంతో ఊగిపోతున్నారు. దేశంలో     నిరుద్యోగ సమస్య పరిష్కారం కానిదే పారిశుధ్య యంత్రాలను సైతం ప్రవేశపెట్టకూడదని శ్రీ ఫెర్నాండెజ్ ఆగ్రహిస్తున్నారు. కంప్యూటర్లు వద్దన్నారు   సరేలే అనుకున్నాం. చివరికి పారిశుధ్యం పనిలో కూడా నిరుద్యోగులు  పోటీపడుతుంటే ఈ దేశం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందా అనిపిస్తుంది. ఇరవైయొకటవ శతాబ్దమనీ, అణుశక్తి అనీ, పారిశ్రామిక విప్లనమనీ   దేశాధినేతలు ఏవేవో కలవరిస్తున్నారు.  ఈ దేశంలో పొట్ట కూటి కోసం        పనిచేస్తున్న లక్షలాది పారిశుధ్య కార్మికులను ఈ ప్రభుత్వాలు ఎప్పటికి        ఉద్ధరించగలుగుతాయి?


Prem Marg
                                                           
        March 1983       N. Rahamthulla Chimakurthy      

                        “Durai’s article on 'Indian Forest Bill’ (Feb ’83) is eye opening and    though provoking. Every philanthropist must do his best to save the tribals  from the devilish clutch of the forest bill. The Government of India must  withdraw  the proposed bill and follow  the guidelines set up by experts  which will save the tribals and give them full freedom and livelihood   right   from the forests”.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి