ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

కలగూర గంప



సముద్రాలను ఆకాశ మార్గం పట్టించాలి

        ఆంధ్రప్రభ 27-5-1987                                      
       చెరువులలోని నీరు ఇంకిపోకుండా అడుగున కాంక్రీటు చేయించాలని        ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమని ఒక పాఠకుడు వ్రాసిన    అభిప్రాయం సరైనది. నీరు ఆవిరైపోకుండా చూడాలి. అందుకోసం చెరువు గట్టు పొడవునా నీడనిచ్చే చెట్లను పెంచాలి. ఆవిరైపోయిన నీరు తిరిగి       భూమి మీద వర్షించాల్సిందే కానీ ఆవిరైపోతున్న నీటిలో సగం కూడా తిరిగి       భూమిని చేరడంలేదట. దానికి కారణ  వాతావరణంలోని వేడి వల్ల           కులవవలసిన     నీరు మళ్ళీ మధ్యలోనే ఆవిరి అవుతుండడం నోవహు    కాలంలో జలప్రళయం వచ్చింది. అప్పడు ఆకాశం పైన కూడా నీళ్ళుండేవి.      సూర్యకిరణాలు ఆ నీళ్ళలో గుండా పయనించి భూమిని చేరేవి. అందువలన   భూమి యావత్తు ఆహ్లాదకరంగా ఉండేది. అయితే జలప్రళయ సమయంలో               దేవుడు ఆగాధ జలాల ఊటలతో పాటు ఆకాశపు తూములు కూడా విప్పి 40 రోజుల్లో భూమిని ముంచి వేశాడు. అంతకు ముందు సముద్రాలు లేవు.        అందువలన సముద్ర జలాలను మళ్ళీ అంతరిక్షంలో కుమ్మరించి వస్తే       భూమి ఆహ్లాదకరంగా మారుతుందని  ఈ మధ్య జెనీవాలో కొందరు    శాస్త్రవేత్తలు సెలవిచ్చారు. ఆయుధాల కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ఖ్రుచ కంటే ఈ పనికి కొంచెం తక్కువ అవుతుందట.


శృంగార కళ అవసరం  

        ఈనాడు 29-8-1980                                        
                   విప్రనారాయణీయం నాటకాన్ని విమర్శిస్తూ కొంతమంది రాస్తున్న     రాతలు వారి సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. బావిలోని    కప్పల్లాగా విద్యోర్ధులను పెంచటం మనకు ఆచారమయిపోయింది. కనీసం డిగ్రీ విద్యార్ధులైనా శృంగార కళ నేర్చుకోక పోతే వారి మనసులకు పరిపూర్ణత ఎలా వస్తుంది? అసలు ఈ తరం బాగుపడాలంటే సెక్స్ విజ్ఞానాన్ని కూడా    పాఠ్య గ్రంధాల్లో చేర్చాలి.



ముద్దులకు హద్దులు

        ఈనాడు 1-9-1980                                      
                   ఆర్టు సినిమాలలో ముద్దులకు సంబంధించి మూడు ప్రతిపాదనలు    చేశారు. కళాత్మకంగా ముద్దు పెట్టుకోవాలి, రెండు కంటే ఎక్కువ   ఉండకూడదు. ముద్దు కథకు సంబంధించి ఉండాలి. ఇంకా ముద్దును క్లోజప్      లో చూపించకూడదని కూడా అన్నారు. ఇన్ని ఆంక్షలకు లోబడి పెట్టుకునే    ముద్దు ఎంత అధ్వాన్నంగా ఉంటుంది? కళాత్మకంగా ముద్దుపెట్టుకోవటం       అంటే ఎలా? అవసరాన్ని బట్టి కథానుసారంగా నటన జరగాలిగానీ,        బలవంతంగా ఏదో ఒక పద్ధతిలో ముద్దుపెట్టుకోవాలనటం బాగుండదు.


మరపురాని బాధే కవిత్వమన్నా
         

        ఆంధ్రజ్యోతి 12-3-1989                                            
                   అంతా బాగున్నప్పుడు మామూలుగా మాట్లాడే వ్యక్తి, బాధల్లో పడినప్పుడు      కవిత్వం అందుకోవటం గమనిస్తున్నాను. పదవులు పోయిన వాళ్ళు, ప్రతి పక్షంలోకి     నెట్టివెయబడిన వాళ్ళు, ఎన్నికలలో ఒడిపోయిన వాళ్ళు అకస్మాత్తుగా     కవులైపోతున్నారు.


సౌర విద్యుత్తుకు పథకాలు
ఆంధ్రప్రభ 14-5-1989                                          
              ఈ సంవత్సరం మార్చి నెలాఖరుకు దేశంలో వివిధ రాష్ట్రాలలో 4672   గ్రామాలను సౌరశక్తి సహాయంతో విద్యుదీకరించినట్లుగా కేంద్ర ఇంధన శాఖ        మంత్రి శ్రీ వసంత సాథే, సయ్యద్ షహబుద్దీన్ కు సమాధానమిచ్చారు. కేంద్ర      ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు సౌర విద్యుత్ అందించేందుకు భారీ పథకాలను మంజూరు చేయవలసిన అవసరం ఉంది.


గోడలపై బూతు చిత్రాలు
అంధ్రప్రభ 8-12-1987                                                
              గోడలపై బూతు చిత్రాల బెడద ఎక్కువై పోయిందని కొంత మంది      గగ్గోలు పెడుతున్నారు. కానీ అవే బూతు చిత్రాలు సినిమా హాళ్ళలోను,       వీడియో పార్లర్లలోను సజావుగా ప్రదర్శించబడుతున్నాయి. బూతు      చిత్రాలను గోడల మీద కాకుండా అసలు హాళ్ళలోనే ప్రదర్శించకూడదని ఒక   ఉద్యమం తేవచ్చుగదా? పోయిన సంవత్సరం పూనా సిటీ సివిల్ కోర్టు 'బ్లూఫిలిం చూడటం నేరం కాదనీ, అది సెక్స్ అభిరుచి గల ప్రేక్షకుల ప్రాథమిక        హక్కు' అనీ తీర్పు నిచ్చింది. గత నెలలో మన రాష్ట్ర హైకోర్టు క్యాబరే డాన్సులపై నిషేదం లేదని స్పష్టం చేసింది. రోమన్ కాథలిక్ చర్చీ (ఇంగ్లండ్) అవివాహిత పూజారులు, పూజారిణులు స్వలింగ సంపర్కం పెట్టుకోవటం       పరిపూర్ణ మానవతకు నిదర్శనం అని సెలవిచ్చింది. ఇంత వింత కోర్కెలు      జనించటం వాటికై పోరాడటం వింతగానే ఉంది.


ఉత్తర కుమారుడు
ఆంధ్రభూమి 3-1-1991                                                కె. రామబ్రహ్మం
                                                                  దెందులూరు
                                                                (ప.గో.జిల్లా)

          1990 సంవత్సరంలో జరిగిన విషయాల్లో తెలుగు పత్రికా రంగం గుర్తుంచుకోదగింది ఒకటుంది. నూర్ బాషా రహంతుల్లా గారి లేఖలు అయిదు తెలుగు దినపత్రికల్లో ఒకే రోజు (28-11-1990) న దర్శన మిచ్చాయి. అలాగే ఆయన రాసిన వ్యాసాలు మూడు తెలుగు దిన పత్రికల్లో ఒకే రోజు (18-12-1990) న వెలువడ్డాయి. నాకు తెలిసినంత వరకు ఇది తెలుగు పత్రికా రంగంలో రికార్డు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి